Breaking News

28/01/2020

ఆ ఉగాది నుంచి... మరో ఉగాది నాటికి..

విజయవాడ, జనవరి 28 (way2newstv.in)
ఉగాది అంటేనే ఉత్సాహం, కొత్త సంబరం, నవ్య కాంతులు అందిస్తుందని, ప్రతి జీవితానికో ఉగాదిని అందిస్తుందని. నిజమే, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ విషయంలో అదే జరిగింది. ఆయన పుట్టి బుద్ధెరిగి ఎన్ని ఉగాదులు చూసి ఉంటాడో, అవి ఎన్ని మంచి ఫలితాలు ఇచ్చాయో లోకానికి ఎరుక లేదు కానీ 2017లో వచ్చిన ఉగాది మాత్రం లోకేష్ కి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఆయన ఆ రోజు మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన అయిదు శాఖలతో భావి నేతగా బంగారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతకు రెండు రోజుల ముందే అంటే 2017 మార్చిలో లోకేష్ శాసనమండలికి ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఆయనను బాబు ఎంపిక చేసి అమాత్య కిరీటం తగిలించారు.
ఆ ఉగాది నుంచి... మరో ఉగాది నాటికి..

యంగ్ మినిస్టర్ గా, సీఎం కుమారుడిగా తన హ‌వా ఒక్క లెక్కన చాటుకున్న లోకేష్ రెండేళ్ళు తిరిగేసరికి మాజీ మంత్రి అయిపోయారు. గత ఏడాది ఉగాది వేళ అంతా మంచే జరుగుతుందని టీడీపీ ఆస్థాన పండితులు చెప్పినా కూడా లోకేష్ జాతకాన్ని మాత్రం 2019 ఉగాది ఎగాదిగా చేసేసింది. టీడీపీ చిత్తుగా ఓడిపోవడమే కాదు, మంగళగిరి నుంచి లోకేష్ కూడా భారీ ఓటమి చెందారు. దాంతో ఆయన ఉత్త ఎమ్మెల్సీగా మిగిలారు. ఈ ఉగాది మళ్ళీ మార్చి 25న వస్తోంది. అయితే అంతకు రెండు నెలల ముందే శాసన మండలిని రద్దు చేసి వైసీపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది. దీన్ని కేంద్రం పార్లమెంట్ లో పెట్టి ఆమోదిస్తే ఏపీ కౌన్సిల్ డోర్స్ శాశ్వతంగా క్లోజ్ కావడం ఖాయం. ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదలు కాబోతోంది. మరి కేంద్రం తలచుకుంటే క్షణాల మీద మండలి రద్దు అవుతుంది. అలా కనుక జరిగితే ఈ ఉగాది వచ్చేసరికి లోకేష్ బాబు మాజీ ఎమ్మెల్సీగా కూడా కొత్త పేరు తగిలించుకుంటారేమోనని సెటైర్లు పడుతున్నాయి.ఏపీలో సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఇంకా నాలుగేళ్ళ వ్యవధి ఉంది. జగన్ దూకుడు చూస్తూంటే టీడీపీ మొత్తం పని పట్టేసేలా ఉన్నారు. ఒక్క దెబ్బకు 34 మంది ఎమ్మెల్సీలు ఉఫ్ అంటూ ఊదేసిన జగన్ మాజీ గా ఉన్న లోకేష్ రాజకీయ భవితతో మరింతగా చెలగాటమాడితే టీడీపీ ఫ్యూచర్ స్టార్ కి కొత్త చిక్కులేనని అంటున్నారు. బాబుకు సీపీఐ తప్ప ఏపీలో రాజకీయ మిత్రులు లేరు. కేంద్రం సహకారం లేదని కూడా పక్కా క్లారిటీ వచ్చెసింది, ఓ వైపు వయసు మీద పడుతోంది. మరోవైపు పార్టీపైన పట్టు జారుతోంది. ఈ టైంలో లోకేష్ కేవలం పార్టీ నేతగా ముందుకు వస్తే ఆదరించేది ఎవరు, హారతి పట్టేదెవరూ, ఓ విధంగా లోకేష్ కి ఇది కష్టకాలమేనని అంటున్నారు.ఏపీలో టీడీపీకి ఎక్కడా బేస్ లేకుండా చేయాలన్నది జగన్ ఎత్తుగడగా ఉంది.దాంతో పునాదులనే పెకిలించేందుకు సిధ్ధపడుతున్నారు. ఈ పట్టుదల ముందు తన పార్టీకి తొందరలోనే మండలిలో మెజారిటీగా వచ్చే ఎమ్మెల్సీలను కూడా కోల్పోవడానికి జగన్ రెడీ అయ్యారంటేనే ఆయన పంతం టీడీపీ అంతమని స్పష్టమవుతోంది. రాబోయే నాలుగున్నరేళ్ళ అధికారంలో జగన్ పసుపు పార్టీని ఎన్ని ఫల్టీలు కొట్టిస్తారో, కాసుకోవడం లోకేష్ వల్ల అవుతుందా అన్నదే ఇక్కడ పాయింట్. జనంలో జగన్ ఉన్నాడు, ఆయన్ని ఎన్ని విధాలుగా విమర్శించినా ఏపీలో జగన్ పాపులారిటీకి దగ్గరలోకి వచ్చే నేత మరో పార్టీలో లేరు. ఇక లోకేష్ కనీసం ఎమ్మెల్సీగా ఫోకస్ అవుదామనుకున్నా కూడా అక్కడా ఖాళీ చేసి పెట్టారు. దాంతో చినబాబుకు ఇక ఉగాదులు ఉండవా, ఎగాదిగా పడాల్సిందేనా అన్నది తమ్ముళ్ళకు పట్టుకున్న కొత్త భయంగా ఉంది.

No comments:

Post a Comment