Breaking News

28/01/2020

దిశ కేసులో మరిన్ని ఆధారాలు..

కీలక దశలో ఫోరెన్సిక్ నివేదిక
హైద్రాబాద్, జనవరి 28 (way2newstv.in)
గతేడాది నవంబరు చివరిలో హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్యాచారం కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ‘దిశ’ అనే వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు పాశవికంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులు మహ్మద్ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేందుకు మరింత బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే, వీటిని పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను తయారు చేసినట్టు సమాచారం.
దిశ కేసులో మరిన్ని ఆధారాలు..

ఈ కేసుకు సంబంధించి శంషాబాద్, షాద్‌ నగర్ పోలీసులు దాదాపు 40 సాక్ష్యాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు డిసెంబరు రెండో వారంలోనే పంపారు. వాటిని ల్యాబ్‌లో సునిశితంగా పరిశీలించి, విశ్లేషించిన అనంతరం.. నిపుణులు నివేదిక తయారు చేశారు. దిశ, ఆమె సోదరి ఫోన్ సంభాషణలోని స్వరాలు, టోల్‌ప్లాజా వద్ద దిశను లాక్కెళ్లేటప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ, బాధితురాలి సెల్ ఫోన్‌లోని నెంబర్లు, ఎస్ఎంఎస్‌లు తదితర కీలక ఆధారాలను విశ్లేషించారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలో పోలీసులకు అందజేయనున్నట్టు తెలిసింది.తొండుపల్లి టోల్ ప్లాజా కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలో దిశకు సంబంధించి దృశ్యాలు రికార్డయిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించేలా ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు చిత్రాలను అభివృద్ధి చేశారు. దుర్ఘటన జరగడానికి ముందు దిశ, ఆమె సోదరి మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలను పరిశీలించగా, అవి స్వరాలేనని తేలింది. ఆ రోజుకు ముందు 15 రోజులుగా దిశ ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలు కూడా పరిశీలించారు. ఎక్కువగా ఆమెతో ఎవరు మాట్లాడారో కూడా పరిశీలించారు.

No comments:

Post a Comment