Breaking News

25/01/2020

ఆకట్టుకుంటున్న ఉద్యాన ప్రదర్శనలు

హైద్రాబాద్, జనవరి 25, (way2newstv.in
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రకరకాల పూలు, కూరగాయల మొక్కలు, పండ్లమొక్కలు, ఇంటికి శోభ తెచ్చే..పలు రకాల ఇంటీరియర్ మొక్కలు, టెర్రస్ గార్డెనింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన మొక్కలు, గోడలపై పెట్టుకునే వర్టికల్ గార్డెన్ మొక్కలను ఇక్కడున్న స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు గ్రాండ్ లుక్ కనిపించేలా ఆర్టిఫిషియల్ మొక్కలూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కనిపించే ఎర్రగులాబీలతోపాటు తెలుపు, పసుపు, నీలిరంగు, పింక్ కలర్ వంటి వివిధ రకాల గులాబీల మొక్కలు ఈ ఎగ్జిబిషన్‌లో కొలువు దీరాయి. వీటితో పాటు బంతి, వివిధ రకాల చామంతులు, జరేనియా, లిల్లీ, దాలియా, పెటానియా, ఇన్పేషన్స్ పూలమొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. 
ఆకట్టుకుంటున్న ఉద్యాన ప్రదర్శనలు

కమలం, వాటర్ లిల్లీ, పిస్కియా, అలాకేషియా తదితర మొక్కల కొనుగోలుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బత్తాయి, నారింజ, రేగి పళ్లు, జామపండ్లు, ద్రాక్ష, దానిమ్మ, సపోటా తదితర పండ్ల మొక్కలూ ఇక్కడ ఉన్నాయి. టమాట, బెండకాయ, చిక్కు డు, బీరకాయ, వంకాయ, సొరకాయ, మునక్కాయ, కాకరకాయ, మిరపకాయ, కొత్తీమీర తదితర మొక్కలతో పాటు వాటికి సంబంధించిన విత్తనాలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు.గార్డెనింగ్‌కు కావాల్సిన వస్తువులతో ప్రదర్శనలో మొక్కలు పెంచేందుకు అవసరమయ్యే రసాయనాలు, పరికరాలతో పాటు ఇళ్లకు, ఇంటి పరిసరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకువచ్చేవందలరకాల పూలకుండీలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. కొబ్బరి నారతో వివిధ రీతుల్లో తయారైన ఫ్లవర్ పాట్స్, బొమ్మల పాట్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రోజుకు ఓసారి నీరు పోసే వసతి ఉండడంతో వీటిని అనేకమంది నగరవాసులు కొనుగోలు చేశారు. వీటితోపాటు కుండీల్లో వేసుకునే పెబ్బల్స్, గార్డెనింగ్ షోకేజ్ ఐటమ్స్, హ్యాంగింగ్స్, ప్లాంట్ స్టాండ్స్ ఇలా అనేక రకాల్లో పాట్స్ కనువిందు చేస్తున్నాయి. విభిన్నరకాల్లో వివిధ రకాల మొక్కలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండటంతో చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు ఈ ప్రదర్శనకు విచ్చేసి తమకు నచ్చిన మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు విభిన్న రకాల్లో మొక్కలు మరో వైపు రుచికరమైన ఆహార పదార్థాలనుతింటూ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తున్నారు నగరవాసులు.స్పెషల్ అట్రాక్షన్‌గా ఫామ్ రోబోట్.. ఈ నర్సరీ మేళాలో ఫామ్ రోబోట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. దేశంలోనే మొదటిసారిగా నగరంలోని ఓపల్ సైబర్ సొల్యూషన్ ఈ పరికరాన్ని కనుగొంది. రోబోటిక్ హ్యూమన్ ఇంటవెన్షన్ లేకుండా విత్తనాలు పెట్టే వరకు మొక్క పెరుగుదలవరకు అన్ని అదే చూసుకుంటుంది. విత్తనాలు పెట్టడం, టైంకి వాటర్ పట్టడం, కాయగూరలు కాశాయని యజమానులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు ఈ రోబోటిక్ మెషీన్ చూసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సాఫ్ట్ వేర్, హార్డ్వేర్ మొత్తం కనెక్ట్ చేసి ఈ రోబొటిక్‌ని తయారుచేశారు. హైటెక్స్‌లో 2019లో ఆగస్ట్ నెలలో లాంచ్ చేశారు. రోబోటిక్‌కు ప్రైవేట్ ఐపీ ఇస్తారు. ఒక్కసారి బాల్కనీలో కానీ, టెర్రస్ పైన కానీ దీన్ని సెటప్ చేసుకుంటే ఒక కుటుంబానికి సరిపడా వెజిటబుల్స్‌ని ఇదే పండిస్తుంది. సంస్థ నిర్వాహకులే వచ్చి సెటప్ చేసి ఆర్గానిక్ పద్ధతిలో ఏర్పాటు చేసి వెళతారు. ప్రతి ఏడాది మట్టిని మారుస్తారు. 120 రకాల ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎలా పెంచాలనేది ఈ రోబోట్‌లో ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. మొక్కలను రోబోట్ నాటేటప్పుడే పంట ఎంత టైంలో చేతికి వస్తుందనే విషయాలని కూడా రోబోట్ చెప్పేస్తుంది. ఏ మొక్కకి ఎంత వాటర్ పోయాలో కూడ రోబోటిక్‌కు తెలిసుంటుంది. ఈ ఫామ్ రోబోటిక్ ధర రూ.2,50,000 ఉంటుంది.

No comments:

Post a Comment