Breaking News

02/01/2020

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి

మహబూబ్ నగర్ జనవరి 2 (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణగా తయారుచేయడం కోసం ప్రతి నెల 339 కోట్ల రూపాయలను ఒక్కరోజు ఆలస్యం చేయకుండా విడుదల చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ తెలిపారు.  గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం లోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి  వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్,  అడిషనల్ పిసిసిఎఫ్  కె.సదానంద్   జిల్లా  అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  గ్రామంలో ఏర్పాటుచేసిన  పల్లెప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుండి 12 వరకు 2 వవిడత పల్లెప్రగతి కార్యక్రమం జరుగుతుందన్నారు.  
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం, సమిష్టి ప్రణాళిక, సమిష్టి అభివృద్ధి  అనే ఆశయాలతో ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ కోరారు. ఈ గ్రామంలో ఖాళీ ప్రదేశాలలో చెట్లను నాటి సంరక్షించాలన్నారు.మీ గ్రామానికి చెత్త సేకరణ కోసం బండ్లు, ట్రాక్టర్లను అందించామని, చెట్ల సంరక్షణ కోసం వాటర్ ట్యాంకర్ ను వినియోగించుకోవాలన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రజలను కోరారు.పల్లెప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయని, పనుల నాణ్యతను  ఆకస్మీకంగా తనిఖి చేస్తామని సి.యస్ అన్నారు. నాటిన చెట్లను సంరక్షించిన తీరు, వైకుంఠదామాల నిర్మాణం తదితర పనులను పరిశీలిస్తారని సి.యస్ తెలిపారు. ఎవరు వెనుక బడి ఉన్నారో గుర్తిస్తారని తెలిపారు.  గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రజలు కృషి చేయాలన్నారు. పల్లెప్రగతిలో మహిళలు, యువకులు భాగస్వామ్యులు కావాలన్నారు.అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని, బిహార్, జార్ఖండ్, రాజస్ధాన్ సరసన నిలబడి కింది నుండి నాల్గవ స్ధానంలో ఉందని, ఈ స్ధానం మెరుగుపడి మొదటి స్ధానంలో నిలిచేలా కృషిచేయాలన్నారు. ప్రతి విద్యావంతుడు నిరక్ష్యరాస్యుడైన మరొకరిని అక్షరాస్యుడుగా మార్చాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా నిలపాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఈ విషయమై ప్రత్యేక శ్రధ్ధ చూపుతున్నారని అన్నారు.  గ్రామాల్లో వార్డు సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి చదువురాని వారిని గుర్తించి జాబిత తయారు చేయాలని, అన్ని వివరాలు వచ్చాకా సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రారంభిస్తామని సి.యస్ అన్నారు. ఆరు నెలల తరువాత మీ గ్రామంలో చదవడం, వ్రాయడం రాని వారు ఉండకూడదన్నారు. మీ గ్రామంలో ప్రతి ఒక్కరు చదవడం, వ్రాయడం నేర్చుకొని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజు మీ గ్రామాన్ని మళ్ళీ సందర్శిస్తానని సి.యస్ ప్రజలకు తెలిపారు.పర్యటనలో భాగంగా రాజపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి ఏర్పాటు చేసుకున్న డంపు యార్డును, ఇంకుడుగుంతలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపుయార్డు లో గాకుండా   గ్రామస్ధులు గ్రామ పంచయాతీ ఇచ్చిన చెత్త డబ్బాల్లో తడిచెత్త, పొడిచెత్త ఇంటివద్దనే విడదీయాలని అన్నారు. దీని వలన సమయం ఆదా అవుతుందని అన్నారు. డంపుయార్డు వద్ద మెడికల్ ప్లాంట్సును పెంచాలని సూచించారు.  డంపుయార్డు వద్ద  అవసరమైన  సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణం వలన గ్రామంలో ఈగలు, దోమలు తగ్గాయని గ్రామస్ధులు తెలుపగా, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారని వారిని అభినందించారు.ఈ పర్యటనలో రంగారెడ్డి గూడెం గ్రామాన్ని పర్యటించి అక్కడి పరిస్ధితులను  అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి  వికాస్ రాజ్ మాట్లాడుతూ గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, ఎవరి గ్రామాన్ని వారె అభివృద్ధి చేసుకునే విధంగా గ్రామస్ధులకు గ్రామ పరిశుభ్రత, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. మొదటి విడతలో భాగాచేశారని, రెండవవిడతలో కూడా ఇదే స్పూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. గ్రామస్ధులందరు కలిసి గ్రామానికి అవసరమైన మౌళిక సదుపాయాలు గుర్తించి వాటి సాధనకు అవసరమైన  కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అన్నారు.  గత సంవత్సరం కేంద్రం, రాష్ట్రం నుండి పొట్లపల్లి గ్రామానికి 6 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం కూడా నిధులను విడుదల చేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment