నల్గొండ, జనవరి 30, (way2newstv.in)
ఆర్టీసీలో కార్గో రేట్లను అధికారులు ఫిక్స్ చేశారు. కిలోమీటర్‌కు రూ. 45 చొప్పున తీసుకోవాలని, అలాగే గరిష్టంగా 5 టన్నుల వరకు పరిమితి నిర్ణయించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 35 బస్సులు సిద్ధమయ్యాయి. సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకున్నారు.సొంతంగా కార్గో అండ్ పార్సిల్ సర్వీసులను నడిపి ఆదాయం పొందేందుకు ఆర్టీసీ కార్గో సేవలను తీసుకురావాలని ప్లాన్ చేసింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ ద్వారానే చేయనున్నారు. బతుకమ్మ చీరలు, స్కూళ్లు, కాలేజీలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాందీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ కార్గో ద్వారానే జరగనుంది.
కార్గోకు 820 బస్సుల రెడీ
చార్జీలు ఎక్కువ పెడితే గిరాకీ ఉండకపోవడం, తక్కువ పెడితే లాస్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ఆపరేటర్ల లెక్కనే కిలో మీటర్‌కు రూ. 45 చొప్పున తీసుకోవాలని డిసైడ్అయ్యారు.వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే కార్గో సర్వీసులను సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం, కార్గో బస్సులు రెడీ కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది.కార్గోకు సంబంధించి మొత్తం 820 బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి విడతగా 50 బస్సులతో సేవలను ప్రారంభిస్తారు. ప్రస్తుతం 35 బస్సులు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు మరో 15 సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం బస్సులు తయారు కావడానికి ఏడాది పట్టనుంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్..ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌తో చేసుకున్న ఒప్పందం అక్టోబర్ వరకు ఉండడంతో అప్పటివరకు పని తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment