Breaking News

11/12/2019

రేవంత్ సొంత కుంపటితో టెన్షన్...టెన్షన్

హైద్రాబాద్, డిసెంబర్ 11, (way2newstv.in)
కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి తీరుపై అంతర్గత రగడ కొనసాగుతూనే ఉన్నది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దరిమిలా రేవంత్‌ మాటలు, చర్యలపై పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నసంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు లాంటి వారు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ ఆ పార్లమెంటు పరిధిలో కార్యాలయాన్ని జూబ్లిహిల్స్‌లో ఏర్పాటు చేయడం, ప్రతి శనివారం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని, మిగిలిన రోజులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. అయితే కార్యాలయ ప్రారంభోత్సవానికి మాత్రం కుంతియాతో పాటు జానారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌అలీ, మల్లురవి తదితర సీనియర్లతో పాటు యువ నాయకులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మానవతారారు తదితరులు హాజరు కావడం గమనార్హం. 
రేవంత్ సొంత కుంపటితో టెన్షన్...టెన్షన్

గతంలోనూ రేవంత్‌ దూకుడుపై పార్టీలో సీనియర్లు పలుమార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని లెక్కచేయకుండా రేవంత్‌రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారనే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా సీనియర్‌ నాయకులతో తిరిగిన రేవంత్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేసే అవకాశముందనే విషయాలపై నా ఆలోచనలు పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రగతిభవన్‌ ముట్టడి పిలుపుకు ముందే రేవంత్‌ ప్రగతిభవన్‌ ముట్టడి పిలుపునిచ్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకవైపు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ, మరోవైపు రేవంత్‌ పిలుపుతో అనివార్యంగా పార్టీ పిలుపుగా మార్చినట్టు సీనియర్ల నుంచి వ్యాఖ్యలు వినిపించారు. యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన తీర్మానాన్ని సీఎల్పీ నేత మల్లెభట్టిు విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ సమర్థించింది. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం ఆ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని మాట్లాడారని, ఇది కేవలం పార్టీని లెక్కచేయకపోవడం, దళితనేతను అవమానించడమేనని సీనియర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలాఉండగా కేసీఆర్‌ను ఢకొీట్టాలంటే రేవంత్‌రెడ్డి లాంటి వారే కరెక్ట్‌ అని రేవంత్‌ వైఖరిని ఆయన అనుయాయులు సమర్థిస్తున్నారు. తాజాగా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియాతో పాటు పలువురు సీనియర్లు, జిల్లాల నుంచి నాయకులు హాజరు కావడం, వారంలో ఒక రోజు మల్కాజిగిరికి, మిగిలిన రోజులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పడం కూడా కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి వైఖరి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్ష పదవిని పలువురు ఆశిస్తున్న నేపథ్యంలో రేవంత్‌ తన బలాన్ని ప్రదర్శించారనే చర్చ జరుగుతున్నది.

No comments:

Post a Comment