Breaking News

02/12/2019

కేసీఆర్ కు పక్కలో బల్లెంలా కమలం

హైద్రాబాద్, డిసెంబర్ 2 (way2newstv.in)
కేసీఆర్ సారు వారు ఇపుడు వరస ఇబ్బందులో పడుతున్నారు. ముఖ్యంగా రెండవమారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకో కేసీయార్ వారికి కాలం కలసిరావడంలేదులా ఉంది. ఎందుకంటే ఆయన ఇలా అధికారంలోకి వచ్చారు, అలా లోక్ సభ ఎన్నికల్లో పదహారు సీట్లు అనుకుంటే సగానికి పడిపోయాయి. పైగా బీజేపీకి నాలుగు సీట్లు రావడం, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అధికారంలోకి రావడం కూడా కేసీయార్ కి పక్కలో బల్లెంలా మారింది. ఇవన్నీ ఇలా ఉండగానే ఆర్టీసీ సమ్మె మరో వైపు తగులుకుంది. దాదాపుగా రెండు నెలల పాటు కేసీయార్ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో తెలంగాణాలో కేసీయార్ కరకు పాలకుడిగా జనం ద్రుష్టిలో పడిపోయారు. 
కేసీఆర్ కు పక్కలో బల్లెంలా కమలం

ఆయన మీద అటు ఉద్యోగ కార్మిక సంఘాలు, ఇటు, ప్రజలు కూడా ఎంతో కొంత వ్యతిరేకతను పెంచుకున్నారు.ఇక తెలంగాణాలో శాంతి భద్రతలు ఇన్నాళ్ళూ బాగానే ఉన్నాయి కానీ ఈ మధ్య వరసగా జరుగుతున్న ఘటనలు పెరిగిన క్రైం రేట్ తో భాగ్యనగరంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. తాజాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై దుండగులు చేసిన దారుణం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడాల్సివచ్చింది. ఏడెనిదేళ్ళ క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం కేసు తరువాత అంత స్థాయిలో ప్రియాంకారెడ్డి కేసు మరో మారు చర్చకు వచ్చింది. హైదరాబాద్ సురక్షితం కాదని సెలిబ్రిటీల నుంచి అంతా అంటున్నారంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఈ ఘటన ఎంతలా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక జాతీయ మహిళా కమిషన్ రేఖా శర్మా హాట్ కామెంట్స్ చేశారు. ఒక నిస్సహాయ యువతిని ఇంత దారుణంగా హింసించి దాడి చేయడం దారుణం, తెలంగాణాలో శాంతిభద్రతలు దిగజారాయ‌ని ఆమె అనడం గమనార్హం.కేసీయార్ తొలి అయిదేళ్ళూ మహిళా మంత్రి లేకుండానే తన పరిపాలన సాగించారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల పాటు మహిళా మంత్రులు లేరు. ఆ తరువాతనే ఆయన కొత్తగా కొందరిని తీసుకున్నారు. ఇక మహిళా కమిషన్ కేసీయార్ అసలు నియమించలేదు. పక్కనున్న ఏపీలో మహిళా కమిషన్ పనిచేస్తూంటే తెలంగాణాలో లేకపోవడం దారుణమే. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం, అక్కడ ఎక్కువగా మహిళలు ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటారు. మరి వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ కేసీయర్ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి.ఇక తెలంగాణాకు మహిళా గవర్నర్ గా తమిల్ సై ని ఏరి కోరి బీజేపీ సర్కార్ పంపించడం వెనక కూడా కేసీయార్ సర్కార్ మహిళల విషయంలో పెద్దగా శ్రధ్ధ చూపడంలేదన్న కారణంగానేనని అంటారు. ఏది ఏమైనా కేసీయర్ పాలన పట్ల ఏడాది కాలంలోనే వ్యతిరేకత పెరుగుతోందనడానికి శాంతిభద్రతల క్షీణత కూడా ఒక అంశంగా మారుతోంది. కేటీయార్ అంతటి మంత్రి నేను స్వయంగా ప్రియాంకారెడ్డి హత్య కేసు పురోగతి పరిశీలిస్తాను అన‌డం ద్వారా కేసీయర్ సర్కార్ ఎలా డిఫెన్సులో పడిందన్నది చెప్పకనే చెప్పారని అంటున్నారు. మహిళా భద్రత తెలంగాణాలో శూన్యమని బీజేపీ నేత డీకే అరుణ చేసిన విమర్శలే కాదు, ఇతర విపక్షాలు చేస్తున్న హాట్ కామెంట్స్ కూడా సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

No comments:

Post a Comment