విజయవాడ, డిసెంబర్ 5 (way2newstv.in)
పీలో టీడీపీ రాజకీయం మరికొద్ది రోజుల్లోనే మారనుందా ? పార్టీ నుంచి మరో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు జంప్ చేస్తారా ? ఈ క్రమంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. పైకి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కోసం ఎంత చేస్తున్నా.. లోలోన రగులుతున్న నాయకుల్లో అసంతృప్తిని ఆయన తగ్గించలేక పోతున్నారు. కంటిన్యూగా అధికార పార్టీపై ఆయన విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనకు అనుభవం లేదని, అందుకే రాష్ట్రం అప్పుల పాలవుతోందని ఆయన ప్రచారం చేస్తున్నారు.అదే సమయంలో అధికార పార్టీకి మతం రంగును అంటించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఇవన్నీ కూడా ముందు తన పార్టీకి బూస్ట్ పెంచుకోవాలనే కీలక ఉద్దేశంతోనే చంద్రబాబు చేస్తున్నారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్...
రోజు రోజుకు తమ పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు అంటూ లేదు. అయితే, ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ప్రకటనలు, విమర్శలు పార్టీలో కొత్తగా తెచ్చిన మార్పు అంటూ ఎక్కడా కనిపించలేదు. భీష్మించుకుని కూర్చున్న టీడీపీ నాయకులు కానీ, ఎమ్మె ల్యేలు కానీ ఎక్కడా చంద్రబాబు చేస్తున్న హడావుడితో బయటకు వచ్చింది లేదు. పైగా చంద్రబాబుతో గొంతు కలిపింది కూడా లేదు.చంద్రబాబు చుట్టూ.. ఎన్నికల తర్వాత ఎంత మంది నాయకులు ఉన్నారో ? ఇప్పుడు కూడా అంతమంది నాయకులే చంద్రబాబు చుట్టూ ఉన్నారు. అయితే, ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉన్న నాయకుల్లో ఏ ఒక్కరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబుకు జై కొట్టిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే వైసీపీ తెరవెనుక చక్రం తిప్పడం ప్రారంభించింది. పలువురు కీలక నేతలను తమ పార్టీలో చేర్చేసుకుంటోంది. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే టీడీపీని వీడారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేనే. మరొకరు వివిధ కారణాలతో దూరంగా ఉన్నారు. అయినా సరే.. త్వరలోనే ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి టీడీపీలో రెండు వికెట్లను పడేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందే చంద్రబాబుకి ఈ షాక్ తగులుతుందన్న టాక్ ప్రకాశం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ఇద్దరు కీలక ఎమ్మెల్యేలను కాపాడాకోగలుగుతారా? లేదా? వంశీ విషయంలోలా చేతులు ఎత్తేస్తారా ? అన్నది చూడాలి.
No comments:
Post a Comment