సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు...
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
నిబంధనల ప్రకారమే లబ్దిదారుల. ఎంపిక
హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సిద్దిపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.in):
సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11,700 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 23 వ తేదీ నుంచి 30 వ తేదీవరకు నిర్వహిస్తామని కలెక్టర్ వెంకట్రామి రెడ్జి మంత్రికి తెలిపారు.
సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక
ఇందు కోసం 65 మంది అధికారులతో 20 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ టీంలలో ఓ జిల్లా అధికారి, మరో ఇద్దరు మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో పది మంది అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 టీంలు 11,700 మంది దరఖాస్తు దారులను క్షేత్ర స్థాయి లో కలిసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయం లోఏర్పాటుచేసిన సెల్ అభ్యంతరాలను స్వీకరించి పరిశీలన జరపుతారని చెప్పారు. జనవరి 1 వ తేదీ నుంచి ఐదో తేదీ వరకు దరఖాస్తులను రీ - వెరిఫికేషన్ నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత వచ్చేే అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు . సంక్రాంతి పండుగకు ముందే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి తుది జాబితాను వార్డుల్లో ప్రదర్శించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పండుగ తర్వాత ఎంపికయిన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్ర స్థాయిలో 20ప్రత్యేక టీంలు పరిశీలన జరిపే టప్పుడు ప్రతీ దరఖాస్తు దారునితో 20 నిముషాలసేపు మాట్లాడి వివరాలు సేకరించాలని సూచించారు. అర్హులైన వారినే నిబంధనల మేరకు ఎంపిక జరపాలని , ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దన్నారు. ఎంపిక పారదర్శకంగా ఉండాలన్న మంత్రి హరీష్ రావు, అర్హులు కాని వారికి తాము ఎందుకు అర్హులము కాలేదన్న సమాచారాన్ని సమగ్రంగా ఇవ్వాలని చెప్పారు. 20టీంలకు 500చొప్పున దరఖాస్తులు ఇచ్చి పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో తాను జోక్యం చేసుకోనన్న మంత్రి హరీష్ రావు తన పేరుతో ఎవరూ చెప్పినా పట్టించుకోవద్దన్నారు. ఏ రాజకీయ నేత జోక్యం చేసుకున్నా పట్టించుకోకుండా అర్హులైన వారినే ఎంపిక చేయాలన్నారు. మతం, కులం, పార్టీ వంటి అంశాలను పట్టించుకోకుండా అర్హులైన పేదలనే ఎంపికచేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎవరి రికమెండేషన్లు పట్టించుకోవద్దని, ఎంపికలోఎవరైనా ఇబ్బంది పెడితే తన దృష్టి కితేవాలని సూచించారు.
No comments:
Post a Comment