Breaking News

21/12/2019

అమరావతికి వాస్తు బాగోలేదట...

అమరావతి, డిసెంబర్ 21, (way2newstv.in)
ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జేఎన్ రావు కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. ఈ సిఫారసులకు జగన్ సర్కారు ఆమోద ముద్ర వేస్తే.. సెక్రటేరియట్ విశాఖకు తరలుతుంది. అసెంబ్లీ మాత్రమే అమరావతిలో ఉంటుంది. రాజధానిగా ప్రస్తుతం ఉన్న ప్రాంతం పనికి రాదని వాస్తుశాస్త్ర నిపుణులు వాస్తు పురుష ప్రసాద్ మొదట్నుంచి చెబుతున్నారు. అమరావతికి వాస్తు దోషం ఉందంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం రాజధానికి పెదకూరపాడు అనుకూలమైన ప్రాంతం అని చెబుతున్నారు. పెదకూరపాడు ప్రాంతమే రాజధానికి సరైందని ఎందుకు భావిస్తున్నారో.. ఆయన మాటల్లోనే..రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం పేరుకే అమరావతి. కానీ అమరావతికి సంబంధం లేని రాజధానికి ఆ పేరు పెట్టారు. పెదకూరపాడు ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఉంటే ఆంధ్రుల రాజధాని అమరావతి అనే పేరుకు సార్థకత చేకూరేది. 
అమరావతికి వాస్తు బాగోలేదట...

పెదకూరపాడును రాజధానిగా చేసి ఉంటే.. సహజ సిద్ధంగానే.. రాజధానికి నాలుగువైపులా రోడ్డుమార్గం ఉండేది. అమరావతి నుంచి క్రోసూరు, క్రోసూరు నుంచి సత్తెనపల్లి, సత్తెనపల్లి నుంచి గుంటూరు, గుంటూరు నుంచి అమరావతి రోడ్డు మార్గాలున్నాయి. ఇది వాస్తుశాస్త్ర పరంగా చాలా ముఖ్యమైంది.రాజధానిగా ఒక ప్రాంతాన్ని గుర్తించడం కోసం ముందుగా ఆ ప్రాంతంలోని వనరులు, నైసర్గిక స్వరూపంపై ఒక అంచనాకు రావాలి.తుళ్లూరు విషయంలో గత పాలకులు తప్పిదమే నేడు రాజధాని రగడకు మూల కారణం. అదే పెదకూరపాడు రాజధానిగా చేసి ఉంటే రాజధానికి సహజసిద్ధంగా అన్ని వనరులు ఏర్పడేవి. పెదకూరపాడు ప్రాంతానికి సమీపంలోనే రైలు మార్గం ఉంది. రోడ్డు మార్గం పరంగా చూస్తే సత్తెనపల్లి దగ్గర్లో ఉంది. గుంటూరు నుండి రోడ్డుమార్గం ఉంది. బ్రిటిషర్లు కూడా పెదకూరపాడుకు దగ్గర్లోని గారపాడులో విమానాశ్రయం నిర్మించాలని భావించారు.గారపాడులో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంది. పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు,అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. రాజధానికి మంచి కనెక్టివిటీ లభించేది. తుళ్లూరు ప్రాంతానికి ఒకవైపు రోడ్డుమార్గం ఉండదు. కానీ పెదకూరపాడు ప్రాంతానికి నలుదిశలా రోడ్డు మార్గం ఉంది.నీటి వనరుల విషయానికి వస్తే.. పెదకూరపాడుకు ఉత్తరం వైపు కృష్ణా నదిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది వాస్తు శాస్త్ర పరంగా చాలా అనుకూలం. ఇక్కడికి 16.8 కి.మీ. దూరంలో ఈశాన్యంగా అమరావతి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఉంటే.. ఈశాన్యంలో అమరావతి ఏర్పడి.. అమరలింగేశ్వరుడి దేవస్థానం, అమరావతి అనే పేరుకు సార్థకత చేకూరేది.తుళ్లూరు ప్రాంతంతో పోలిస్తే... పెదకూరపాడు ప్రాంతంలో భూముల ధర చాలా తక్కువ. ఈ ప్రాంతంలో అన్ని కులాల వారు ఉన్నారు. తుళ్లూరు తరహాలో ఒకే సామాజిక వర్గానికి అనుకూలం అనే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. పెదకూరపాడు ప్రాంతంలో నేల గట్టిగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ ఖర్చు కూడా తగ్గేది.తుళ్లూరు ప్రాంత ప్రజలు ఇప్పటికే అభివృద్ధి చెందారు. పెదకూరపాడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసి ఉంటే.. ఈ ప్రాంత వాసులు, రైతులు అభివృద్ధి చెందేవారు. వెనుకబడిన ప్రాంతమైన పిడుగురాళ్ల కూడా అభివృద్ధి చెందేది. ధరణికోట ఈ ప్రాంతానికి చేరువలో ఉంది కాబట్టి నిజమైన శాతవాహునుల రాజధానిగా అమరావతి వెలుగొందేది.రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు చాలా పొరపాటు చేశారు. తాత్కాలిక రాజధానిని మందడం దగ్గర నిర్మించే బదులు గుంటూరు లామ్‌లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి ఉంటే ఆ భవనాలు ఉపయోగపడేవి, నిర్మాణవ్యయం కూడా తగ్గేది. భవిష్యత్తులో అమరావతి - గుంటూరు రహదారిని దాటి రాజధానిని అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉండేది.తుళ్లూరు కాకుండా పెదకూరపాడు రాజధాని చేసి ఉంటే.. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాలు భవిష్యత్‌లో ప్రగతిపథంలో పయనించేవి. తుళ్లూరు రాజధాని కావడంతో మంగళగిరి, విజయవాడ మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి

No comments:

Post a Comment