Breaking News

04/12/2019

మళ్లీ తెరపైకి చెప్పుల కధలు

అప్పుడు అన్నగారు... ఇప్పుడు బాబుగారు
విజయవాడ, డిసెంబర్ 4 (way2newstv.in)
చెప్పుల కధ తెలుగు రాజకీయాలకు కొత్త కాదు, అప్పట్లో అంటే పాతికేళ్ల క్రితం హైదరాబాద్ లో ఆగస్ట్ సంక్షోభంలో అన్న గారి మీద తమ్ముళ్లు చెప్పులతో దాడి చేశారు. ఆ తరువాతనే టీడీపీ నుంచి ఎన్టీఆర్ కి శాశ్వతంగా బంధం తెగిపోయింది. ఇక ఇపుడు చూసుకుంటే అల్లుడు గారు చంద్రబాబు మీద సైతం అదే రకమైన చెప్పులతో దాడి జరిగింది. అన్న గారికి విషయంలో నాడు లోకం సానుభూతి చూపినా వాడుకునే రాజకీయ నైపుణ్యం, వాడుకోవాలన్న దురూహ ఆయనకు లేకపోవడంతో అక్కడ కధ ఆలా ఆగిపోయింది. కానీ ఇపుడు మాత్రం చంద్రబాబు తన వాహనం మీద పడిన చెప్పులనే ఆయుధంగా మార్చుకోవాలని సానుభూతిని పొందాలని చూస్తున్నారు. నిజానికి మాజీ ముఖ్యమంత్రి మీద చెప్పుల దాడి అన్నది ఖండించాల్సిన విషయమే. 
మళ్లీ తెరపైకి చెప్పుల కధలు

దీనికి తోడు అక్కడ ఉన్నది టీడీపీ. దాంతో పీకి పాకం పట్టేంతవరకూ ఊరుకునేలా కనిపించడంలేదు. జాతీయ స్థాయిలో పెట్టి పెద్ద ఎత్తున చర్చకు తెరతీయాలని కూడా టీడీపీ చూస్తోంది. ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఈ విషయం మీద కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసారు. ఏపీలో ఒక మాజీ ముఖ్యామంత్రికే భద్రత లేకుండా పోయిందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలు దిగజారాయని కూడా ఆందోళన వ్యక్తం చేసారు. ఏపీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని కళా అంటున్నారు. మరో వైపు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ని కలసిన‌ టీడీపీ నేతలు బాబుపై చెప్పుల దాడి అంశాన్ని ఫిర్యాదు చేశారు. ప్రముఖ నాయకుడి మీద ఈ రకమైన తీరుని ప్రభుత్వం చూపించడంపైన వారు తమ బాధను వ్యక్తం చేశారు. గవర్నర్ దీని మీద చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని పార్టీ నేత అచ్చెన్నాయుడు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇంతటితో వదిలేయమని వైసీపీ దౌర్జన్యాలను అందరి ద్రుష్టిలో పెడతామని కూడా గట్టిగానే చెబుతున్నారు.నిజానికి మొదట్లో ఎలా ఉన్నా వెంటనే వైసీపీ సర్కార్ ఈ విషయంలో సర్దుకుంది. చెప్పు విసిరింది ఓ బాధత‌ రైతు అని పోలీసులు చెబుతున్నారు. విచారణ కోసం సిట్ ని ఏర్పాటు చేసి వివక్ష ఎక్కడా లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళాలని టీడీపీ నిర్ణయించిన నేపధ్యంలో వైసీపీ ఎత్తుగడలు ఎలా ఉంటాయన్నది చూడాలి. ఇప్పటికే ఏపీలో టీడీపీ క్యాడర్ని పొట్టన పెట్టుకుంటున్నారని బాబు గట్టిగా ఆరోపిస్తున్నారు. దాదాపుగా ఆరు వందల మంది వరకూ తమ పార్టీ వాళ్ళను ఆరు నెలల కాలంలో చంపేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఈ సంఘటనను ఉపయోగింకుంటే మాత్రం వైసీపీ చిక్కుల్లో పడినట్లే. దీని మీద ఢిల్లీ వెళ్ళినపుడు కూడా రచ్చ చేయడానికి బాబు పక్కా ప్లాన్ తో రెడీగా ఉన్నారు. మరి బాబు సెక్యూరిటీ పరంగా చూసినా ఆయన రాజకీయ సీనియారిటీ చూసిన చెప్పులు వేయడం అన్నది మైనస్ పాయింటే. ఇది ఎలా జరిగినా కూడా మచ్చ మాత్రం వైసీపీ సర్కార్ కే వస్తుందని తలపండిన కాంగ్రెస్ నేత వి హనుమంతరావు లాంటి వారు సైతం తాజాగా ఏపీ పర్యటనలో చెప్పుకొచ్చారు. మరి చూడాలి చెప్పు రాజకీయం వైసీపీ సర్కార్ కి ఎంతవరకూ చేటు తెస్తుందో

No comments:

Post a Comment