తుగ్గలి డిసెంబర్ 03, (way2newstv.in)
తుగ్గలి మండల పరిధిలోని పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను మంగళవారం వైయస్సార్ పార్టీ ఆఫీసు లో ఎమ్మెల్యే శ్రీదేవి మరియు తుగ్గలి వైయస్సార్సీపి నాయకులు మోహన్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా మామిళ్ల కుంట మూలింటి రాముడు 60,000,ఎద్దుల దొడ్డి లక్ష్మీదేవి 20,000, చెన్నంపల్లి ఓరుగంటి మహేశ్వర్ రెడ్డి 20,000, ఎర్రగుడి తాండకు చెందిన రమావత్ వెంకటేష్ నాయక్ 30,000,రమావత్ లక్ష్మీబాయి 25,000, రామలింగాయ పల్లె సుమలత 35,000,జి ఎర్రగుడి గ్రామానికి చెందిన తలారి దేవేంద్ర 60,000, తుగ్గలి కి చెందిన చేపల షేక్ మహమ్మద్ 22,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని,ప్రజా శ్రేయస్సు కొరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో మామిళ్ల కుంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి,సత్యనారాయణ,వైయస్సార్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment