కర్నూలు డిసెంబర్ 2 (way2newstv.in)
కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ 49వ వార్డ్ జొహరాపురం నందు ఎమ్మెల్యే నగరబాటను నిర్వహించారు. వీధిలో ప్రజలు పడుతున్న సమస్యను తెలుసుకున్నారు. ప్రతీ సమస్యను పరివేక్షిస్తు ప్రజలను అడిగి మరి తెలుసుకున్నారు. అధికారులకు ప్రజల పడుతున్న సమస్యలు, నీటిసమస్య, వీధిలోచెత్త, కాల్వలు మరియు కరెంటు తీగల ఇతర సమస్యల గురించి వివరించారు.
జోహరాపురంలో ఎమ్మెల్యే నగరబాట
అక్కడే పరిష్కారం మార్గం చూపేలా చర్యలు తక్షణమే చెప్పటాలని అయన అన్నారు. ప్రజల సమస్య పై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే సహించేది లేదని అన్నారు. డ్రైనేజీ పై అధికారులు పనితీరు పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పై పని చేయని వారి పై సస్పెండ్ కూడా వెనుకాడొద్దు అని అధికారులకు అదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కమీషనర్ ఏస్. రవీంద్రబాబు, ఎమ్ఈ సురేంద్ర బాబు, హెల్త్ ఆఫీసర్ పుష్పావతి, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వార్డ్ వాలంటర్లు, వైసీపీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతీనిది తెర్నేకల్ సురేందర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, రియాజ్, ఇబ్రు, శాలి, కుమార్, ఇమ్రాన్, రఫీక్, చురీబీ ఫహారబి, ఫజల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment