విజయవాడ, డిసెంబర్ 18 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం వలన రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అధిక సంఖ్యలో పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిందని తెలిపింది. అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు మిగిలాయని పేర్కొంది.
రివర్స్ టెండరింగ్ తో 1500 కోట్ల ఆదా
అందులో పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.782.80 కోట్లు, అలాగే పోలవరం లెఫ్ట్ ప్యాకేజి పనుల్లో రూ.58.53 కోట్లు, జెన్ కో బొగ్గు రవాణా లో రూ. 186 కోట్లు, వెలిగొండ రెండో టన్నెల్ లో మిగిలిన పనులకు రూ. 61.76 కోట్లు, గ్రామా/ వార్డు సచివాలయంలో కంప్యూటర్లు/ ప్రింటర్ల లో రూ.65.47 కోట్లు, జెన్ కో బొగ్గు పర్యవేక్షణలో రూ. 25 కోట్లు, 4జీ సిం కార్డులు పోస్ట్ పెయిడ్ లో రూ. 33.77 కోట్లు, పోతురాజు నాలా డ్రైనేజి పనుల్లో రూ. 15.62 కోట్లు, ఇళ్ల నిర్మాణంలో రూ. 151.94 కోట్లు, గ్రామా/ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్ల కోసం రూ. 83.80 కోట్లు, అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు.. మొత్తం రూ.1,532.59 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదా అయినట్టు తెలిపింది.
No comments:
Post a Comment