Breaking News

18/12/2019

2022 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 (way2newstv.in)
అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్రం.. నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను మంగళవారం ప్రారంభించింది. వచ్చే కొన్నేండ్లలో ఈ మిషన్ కోసం రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఈ ప్రత్యేక మిషన్‌ను ఆరంభించింది కేంద్రం. 2024 నాటికి 30 లక్షల కిలోమీటర్ల మేర అప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయడంతోపాటు ప్రతి వెయ్యి మందికి ఒక టెలికం టవర్‌ను ఏర్పాటు చేయబోతున్నది.వినియోగదారులకు నాణ్యమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ మిషన్ ఎంతో దోహదం చేయనున్నదన్నారు. 
2022 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్

దీంట్లోభాగంగా 2022 నాటికి అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు ప్రస్తుతం దేశీయంగా ఉన్న 5.65 లక్షల టవర్లను 10 లక్షలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.విద్యా, ఆరోగ్యం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అభివృద్ధిలో టెక్నాలజీకల్ మౌలిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ మిషన్ కీలకమన్నారు. అలా గే ఇంటర్నెట్ వేగాన్ని కూడా భవిష్యత్తులో 50 ఎంబీపీఎస్‌లకు పెంచే ప్రణాళిక కూడా ప్రభుత్వం వద్ద ఉన్నదన్నారు. ఈ బృహత్ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి వీలు పడనున్నదన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత వేగితరం చేయడానికి ఈ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ లక్ష్యమని, డిజిటల్ సాధికారిత, తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్నదే ఈ మిషన్ లక్ష్యం.

No comments:

Post a Comment