ముంబై, నవంబర్ 1, (way2newstv.in)
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. నవంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది. స్వంతంగానే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 6 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ నేతలంటున్నారు.
ఐదున ఫడ్నవిస్ ప్రమాణం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నారు. కూటమి నుంచి శివసేన దూరంగా ఉన్నా.. బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్దమైంది. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల బాధ్యతలను బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్, చంద్రకాంత్ పాటిల్ తీసుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. అయితే అధికారాన్ని పంచుకోవాలన్న నిబంధనను శివసేన వత్తిడి చేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది
No comments:
Post a Comment