విజయవాడ, నవంబర్ 1, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పిన హామీని నెరవేర్చారు. పంటకు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడ రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ హామీని నెరవేర్చేందుకు.. పరిహారం అందించేందుకు నిధులు విడుదలయ్యాయి.రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున రూ.13 కోట్లు కేటాయించారు.
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు రూ. కోటి రూపాయలు చొప్పున వారి గ్రీన్ చానెల్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తక్షణమే వారి కుటుంబాలకు జిల్లా కలెక్టరే స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందజేస్తారు.ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం జగన్ గతంలోనే తీసుకున్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. తాజాగా జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు కూడా విడుదల చేశారు.
No comments:
Post a Comment