పెద్దపల్లి , నవంబరు 01(way2newstv.in)
జిల్లాలో నవంబర్ 4,2019 నుంచి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 4 నుంచి నవంబర్ 11,2019 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒపెన్ ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని, పెద్దపల్లి జిల్లాలో 362 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు, 7 గురు విద్యార్థులు.
నవంబర్ 4 నుంచి ఒపెన్ ఇంటర్, పదవ తరగతి పరీక్షలు
ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్షలకు, 300 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవు తున్నారని, వీరి కోసం అవసరమైన పరీక్షా కేంద్రాలను ఎర్పాటు చేసామని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) ను పరీక్షా కేంద్రంగా, పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలికల)ను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు.
No comments:
Post a Comment