విజయవాడ, నవంబర్ 2 (way2newstv.in)
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ప్రభుత్వంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించుకున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. సామాజిక సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ వర్గాలకు చెందిన నాయకులకు ఉప ముఖ్యమంత్రులుగా కీలక పదవులు అప్పగించారు. కురుపాం నుంచి గెలిచిన పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ పిల్లి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత ఆళ్ల నాని, కడప జిల్లాకు చెందిన మైనారిటీ నేత అంజాద్ బాషా, చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు కళత్తూరు నారాయణ స్వామిలను జగన్ ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు.అయితే, వీరిలో ఒక్క బోస్ తప్ప మిగిలిన వారు సుద్ధ దండగ అనే పేరు తెచ్చుకున్నారని అంటున్నారు పరిశీలకులు.
సోషల్ ఇంజనీరింగ్ సరే... ఇద్దరిదే పెరాఫార్మెన్స్
ఆయా జిల్లాల్లో వీరి డామినేషన్ కానీ, వీరు చేస్తున్న అభివృద్ధి కానీ ఎక్కడా కనిపించడం లే దని చెబుతున్నారు. నారాయణ స్వామి పరిస్థితి చూస్తే.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి ఫైర్ బ్రాండ్లు ఇ ద్దరు ఉన్నారు. రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ముగ్గురూ కూడా ఎవరికి వారే దూకుడు ఎక్కువ. వీరికి వాస్తవానికి పదవులతో సంబంధం లేదు. అధికారులపై కానీ, ప్రజల్లో కానీ వీరి కి పట్టు ఎక్కువగానే ఉంది. దీంతో నారాయణ స్వామి పరిస్థితి ఏదో నామ్‌కేవాస్తే అన్నట్టుగా ఉందని చెబు తున్నారు. అసలు ఆయన మాట జిల్లాలో ఏ అధికారి కూడా వినే పరిస్థితి లేదట.ఎస్టీ వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. విజయనగరం జిల్లాకు చెంది న వాణిపై అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స డామినేషన్ ఎక్కువగా ఉందని అంటు న్నారు. దీంతో ఆమెకు కూడా మార్కులు పెద్దగా పడడం లేదు. కడపలో అంజాద్ బాషా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ నుంచి వైసీపీలో కీలకంగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరుల డామినేషన్ ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉద్దండులే కావడంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.ఇక, కాపు వర్గానికి చెందిన ఆళ్లనాని పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదని అంటున్నారు. వాస్తవానికి ఆది నుంచి కూడా పెద్దగా వివాదాలు, దూకుడుకు దూరంగా ఉండే నాని.. ఇప్పుడు కూడా అలాగే ఉండడంతో జిల్లాలో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇక, బీసీ కోటాలో మంత్రి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే వీరికి భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఏ విషయాన్నయినా.. ఆచి తూచి వ్యవహరించడం, అధికారులతో తరచుగా సమీక్షలు పెట్టడం, పెద్దగా విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన పనేదో తాను చేసుకునిపోవడంతో ఆయనకు మంచి మార్కులు పడుతున్నాయి. అది కూడా పార్టీలో సీనియర్ కావడంతో పాటు జగన్ కుటుంబానికి నమ్మకస్తుడు కావడమే ఆయనకు కాస్త ప్రయార్టీ ఉందట. మొత్తంగా చూసుకుంటే.. జగన్ కు ఉన్న ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో కేవలం ఒకరు మాత్రమే పాస్ మార్కులు పొందారని అంటున్నారు పరిశీలకులు.
No comments:
Post a Comment