నల్గొండ, అక్టోబరు 26 (way2newstv.in)
ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వాలని మొదట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గోదావరి నదిపై 35 ఇసుక రీచ్‌లను నవంబర్ ఒకటి నుంచే ప్రారంభించటానికి సన్నాహాలు చేసింది. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటి, పర్యావరణ ప్రభా వ మదింపు కమిటీలకు దరఖాస్తులు పంపించింది. పర్యావరణ విధ్వంసాన్ని పట్టించుకోకుండా రాష్ఠ్రంలో జరిగిన ఇసుక తవ్వకాలతో నాలుగేండ్ల కాలంలో రూ. 3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 832 కోట్లు ఆదాయం వచ్చింది. దీనిలో సింహ భాగం మేడిగడ్డ, అన్నారం బ్యారే జీల వద్ద తీసిన ఇసుక ద్వారానే కావటం విశేషం. ఎన్ని అడ్డ దారులు తొక్కినా రాష్ట్రంలో డిమాండ్‌కు తగినంత ఇసుకను సరఫరా చేసే పరిస్థితి ఇప్పటికీ లేదు.
ఇసుక రీచ్ లకు ప్రజాభిప్రాయం అడ్డంకులు
దాదాపు 1.4 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం కాగా రాబోయే కాలంలో 1.10కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేసే అవకా శం ఉన్నదని అధికారులు తెలిపారు. నది నుంచి తీసే ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతిఇసుకను ప్రోత్సహించాలని రాష్ఠ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ దశగా పరిశ్రమల శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ప్రజాభి ప్రాయ సేకరణ, పర్యావరణ ప్రభావ అంచనా పూర్తయిన తర్వాతే పర్యావరణ అనుమతులు ఇస్తామని ఈ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. ఖనిజాభివృద్ధి సంస్థ అధికా రులు ఇటీవల ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ శాఖ అధికారు లను కలిశారు. వారు కూడా ఇదే సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఒక సంవత్సరం విరామం తర్వాత పర్యావరణ కమిటీల నియామకం జరిగింది. ఇసుక రీచ్‌ల కోసం ఈ కమిటీలకు ప్రతిపాదనలను పంపినప్పటికీ అనుమతులు రాక పోవటం తో రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది.నదుల్లో ఐదు హెక్టార్ల కన్నా ఎక్కువ ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరపాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, ఐదు హెక్టార్ల లోపు ఇసుక తవ్వకాల అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా పర్యావరణ కమిటీలకు లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ వివిధ కేసుల్లో స్పష్టం చేసింది. అయినప్ప టికీ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే ఇసుక తవ్వకాలను ఇప్పటి వరకూ కొననసాగించారు. రిజర్వా యర్లలో పూడిక తీయటాననికి పర్యావరణ అనుమతులు అవసరం లేదనే నిబంధన అడ్డం పెట్టుకుని అడ్డదారిలో 20 ఇసుక రీచ్‌లను కాంట్రాక్టర్లకు అప్పగించి 3.6 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు. దీనిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణం పూర్తి కావటంతో అక్కడ నీరు నిల్వ ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఇక్కడి ఇసుక రీచ్‌లను మూసి వేయాలని ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. గోదావరి నదిలోనే ఇసుక నిల్వలు అధికంగా ఉండటంతో ఈ సంవత్సరం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1.3 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయటానికి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారు. గిరిజన సహకార సంఘాల ద్వారా నిర్వహించే ఈ రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. జేసీబీల ద్వారా కాకుండా నదిలో కూలీల ద్వారా ఇసుక లోడింగ్ చేయాలనే నిబంధన ఉన్నది. ఈ నిబంధనతో రాష్ట్ర అవసరాలకు సరిపోయే ఇసుక అందించలేమనని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అభిప్రాయ పడుతున్నది.ఐదు హెక్టార్లకు మించిన ఇసుక రీచ్‌ల అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం, మలుగు జిల్లాల్లోని గిరిజన ప్రాంతంలో ప్రతిపాదించిన ఇసుక రీచ్‌ల కోసం పంచాయితీల వారీగా ఇవి జరుగుతాయి. కేంద్ర పర్వావరణ శాఖ పర్యవేక్షణలో ఇవి జరగాల్సి ఉంది. ఈ మేరకు అవసరమైన మారదర్శక సూత్రాలను రూపొందించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగమై ఉన్నది. ప్రజాభిప్రాయ సేకరణ నవంబర్ నెలలో పూర్తి చేయాలని ఖనిజాభివృద్ధి సంస్థ భావిస్తున్నది.ఇది పూర్తయినన తర్వాత కూడా పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ వద్ద నిల్వ ఉంచిన ఇసుక మరో రెండు నెలల కాలం వరకూ సరిపోతుందని వారు తెలిపారు.
No comments:
Post a Comment