Breaking News

02/10/2019

విశాఖలో టీడీపీ ఖాళీ ....

విశాఖపట్టణం, అక్టోబరు 2, (way2newstv.in)
విశాఖ జిల్లా టీడీపీకి ఏమైందో తెలియడంలేదు. అన్న నందమూరి కాలం నుంచి ఈనాటి చంద్రబాబు జమానా వరకూ బలమైన పునాదులతో పటిష్టంగా ఉన్న టీడీపీ ఇపుడు ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోతోంది. ముఖ్యంగా నాయకులలో ఎక్కడా ఆత్మవిశ్వాసం కనబడడంలేదు, ఇక క్యాడర్ సైతం నిరాశాలో కూరుకుపోయారు. మరో అయిదేళ్ల పాటు ప్రతిపక్ష పోరాటం అంటే ఎవరూ అంత శక్తిని కూడగట్టుకోలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు టీడీపీని దశాబ్దాలుగా అంటిపెట్టుకున్న నాయకులు సైతం పార్టీని వీడిపోవడానికి రెడీ అవడాన్ని అర్ధం చేసుకోవచ్చు.విశాఖ రూరల్ జిల్లా టీడీపీ దాదాపు ఖతం అయిపోయిందనే చెప్పాలి. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా సమర్ధులైన నేతలే ఇపుడు టీడీపీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. 
విశాఖలో టీడీపీ ఖాళీ .....

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీదాస్ కుటుంబం మొత్తం వైసీపీలో చేరిపోయింది. మంత్రి అయ్యన్నపాత్రుడు తమ్ముడే పార్టీని వీడిపోయారు. ఇక మిగిలిన వారిలో రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో రూరల్లో మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కూడా పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. అదే విధంగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ ఎన్ రాజు కూడా టీడీపీలో ఉండాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నారట. దీంతో ఒక్క అయ్యన్న తప్ప మొత్తానికి మొత్తం టీడీపీ వైసీపీ వైపుగా షిఫ్ట్ అయిపోతోందని అంటున్నారు.ఇక అర్బన్ జిల్లా టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ సైతం పార్టీని వీడుతారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆయన్ని అర్బన్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ గౌరవించకపోవడం, వర్గ రాజకీయాలు చేయడంతో గుస్సా అవుతున్నారు. అధినాయకత్వానికి ఈ విషయం విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇక టీడీపీలో ఉండి లాభం ఏంటి అన్న ఆలోచనలో రహమాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడని పేరు. దాంతో ఆయన కూడా సైకిల్ ఎక్కేస్తారని అంటున్నారు. తనకు వైసీపీలో సరైన హామీ వస్తే మాత్రం రహమాన్ పార్టీ మారేందుకు సిధ్ధమని అంటున్నారు. విశాఖ రాజకీయాలో బలమైన మైనారిటీ వర్గానికి చెందిన రహమాన్ వైసీపీలోకి వస్తే టీడీపీకి పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు. ఇక నిన్నటి వరకూ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన లాలం భవాని, ఆమె భర్త, సీనియర్ నేత లాలం భాస్కరరావు సైతం టీడీపీని వీడిపోతారని టాక్ నడుస్తోంది. మొత్తానికి విశాఖ టీడీపీ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు పుడుతున్నాయి.

No comments:

Post a Comment