Breaking News

02/10/2019

రైస్ మిల్లుల సాక్షిగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

ఒంగోలు, అక్టోబరు 2, (way2newstv.in)
బియ్యం ప్రభుత్వానివి.. చేరాల్సింది పేదలకు.. అందించాల్సింది రేషన్‌ దుకాణాలు..! బాధ్యత వహించాల్సింది అధికారులు..!! ప్రభుత్వం లెక్క ప్రకారం జాగ్రత్తగానే బియ్యం అందిస్తోంది.. కానీ, అవి పేదలకు చేరేలోపే పక్కదారి పడుతున్నాయి. పేదల బియ్యాన్ని కొందరు పెద్దలు బకాసురుల్లా భోంచేస్తున్నారు. నెలకు రూ. మూడు కోట్లకు పైగా మెక్కుతున్నారు.ప్రకాశం జిల్లా కందుకూరు, లింగసముద్రం‌పాంతాల్లో ఆరు రైస్‌ మిల్లుల్లో నిత్యం ఇదే తంతు. కేవలం ఈ కార్యకలాపాలకే వీటిని నిర్వహిస్తుంటారు. వీటి ద్వారా రెవెన్యూ, పోలీసులకు కూడా భారీ మొత్తంలో మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో అడపాదడపా కందుకూరులో దాడులు జరిగినా... ఈ మిల్లుల మూలాల్లోకి ఎవరూ వెళ్లరు. కారణం.. ఈ మిల్లుల వెనుక కొందరు నాయకులు అండగా ఉండి.. నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అద్దంకిలోని ఓ మిల్లులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతుంటాయి. 
రైస్ మిల్లుల సాక్షిగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

ఇక్కడ ఇద్దరు భాగస్వాములు ఓ నాయకుడికి ప్రధాన అనుచరులే. అధికారులపై ఒత్తిళ్లతో ఇన్నాళ్లు దాడులు, తనిఖీల నుంచి తప్పించుకున్నారు. టంగుటూరు, జరుగుమల్లి, ఉప్పుగుండూరు ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 రైస్‌ మిల్లుల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం.అద్దంకిలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియాన్ని ఇటీవల విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 49 బియ్యం బస్తాలతోపాటు ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే గన్నీ సంచులు వందలాదిగా లభించాయి. ఈ మిల్లు యజమాని జిల్లాలోని ఓ కీలక నాయకుడి ప్రధాన అనుచరుడు. ముగ్గురు కలిసి భాగస్వాములుగా అక్రమ వ్యాపారాన్ని విస్తరించారు. దీనికి సదరు నాయకుడి సిఫార్సులు ఉంటున్నాయి.కందుకూరు, లింగసముద్రంలోని ఆరు రైస్‌ మిల్లులు.. అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నేరుగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా కందుకూరు చుట్టుపక్కల ఈ తరహా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు. దీనికి కొందరు నాయకుల మద్దతు ఉంటోంది.నాగులుప్పలపాడు మండలంలో రెండు రైస్‌ మిల్లులు ఉండగా- ఉప్పుగుండూరులోని మిల్లు నుంచి తరచూ రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. దీనికి ఒక నాయకుడి ఆశీస్సులు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా నెలకు వెయ్యి టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దనే దీనికి వ్యూహ రచన, కార్యాచరణ జరిగిపోతోంది.విజిలెన్స్‌ అధికారులు రామచంద్రాపురంలోని విష్ణువర్ధన్‌ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించగా- 336 రేషన్‌ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. గతవారం మూడుచోట్ల చౌక దుకాణాల్లో తనిఖీలు చేస్తే 100 బస్తాల లెక్క తేడా కనిపించింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ అక్రమంగా తరలిస్తున్న సుమారు 1500 బస్తాల (75 టన్నులు) పేదల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ బహిరంగ విఫణిలో రూ. 20 లక్షలకుపైనే.. ఇవి పట్టుబడినవి మాత్రమే.. ఇక దొరక్కుండా, నిఘాకు చిక్కకుండా తరలిపోతున్నవి ఎన్నో.. ఏడాది వ్యవధిలో జిల్లాలో 280 6ఏ కేసులు నమోదయ్యాయి.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే మళ్లీ మళ్లీ అదే తప్పునకు పాల్పడుతున్నారు.
వాయిస్ 4:
విజిలెన్స్‌ అధికారులు తాజాగా శనివారం జరుగుమల్లి మండలం రామచంద్రాపురంలోని విష్ణువర్ధన్‌ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించగా- 336 రేషన్‌ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. గతవారం మూడుచోట్ల చౌక దుకాణాల్లో తనిఖీలు చేస్తే 100 బస్తాల లెక్క తేడా కనిపించింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ అక్రమంగా తరలిస్తున్న సుమారు 1500 బస్తాల (75 టన్నులు) పేదల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ బహిరంగ విఫణిలో రూ. 20 లక్షలకుపైనే.. ఇవి పట్టుబడినవి మాత్రమే.. ఇక దొరక్కుండా, నిఘాకు చిక్కకుండా తరలిపోతున్నవి ఎన్నో.. ఏడాది వ్యవధిలో జిల్లాలో 280 6ఏ కేసులు నమోదయ్యాయి.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే మళ్లీ మళ్లీ అదే తప్పునకు పాల్పడుతున్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని.. బియ్యంగా మార్చి.. ప్రభుత్వం సేకరించి గిడ్డంగుల్లోకి చేర్చాలి. తద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుతాయి. అక్కడి నుంచి చౌక దుకాణాలకు వెళ్లాలి. పక్కదారి పట్టడంలో కొనుగోళ్ల దగ్గర బీజం పడితే, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ప్రక్రియ కీలక దశకు చేరుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ప్రతి బస్తాపై కనీసం మూడు కిలోలు తక్కువగా పంపిస్తారు. ఇలా మిగిలిన బియ్యాన్ని కిలో రూ. 15 చొప్పున బయటకు విక్రయిస్తారు. చౌక దుకాణాల్లోనూ వినియోగదారులకు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు. తీసుకోకుండానే వేలిముద్రలు వేసేసి కార్డుదారులే కిలో రూ. 8 నుంచి రూ. 9 చొప్పున తీసుకుని వదిలేస్తున్నారు. ఇది రెండో దశలో అక్రమం. ఇక ఇలా మిగిలిన బియ్యం మొత్తం మిల్లర్లే కిలో రూ. 15 చొప్పున కొనుగోలు చేసుకుని తమ పని కానిస్తున్నారు.
ఎండ్ వాయిస్ :
ఈ అక్రమ వ్యాపారం కోసమే జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైస్‌మిల్లులు ఉన్నాయి. నెలకు 11 వేల టన్నుల బియ్యం పేదలకు సరఫరా చేయాల్సి ఉండగా- అందులో 3వేల నుంచి 4 వేల టన్నులు పక్కదారి పడుతోంది. విపణిలో విలువ రూ. మూడు కోట్ల పైమాటే... ప్రభుత్వానికి కూడా రాయితీ నష్టమే.. చౌక బియ్యానికి సోకులద్ది, పాలిషింగ్‌ ప్యాకెట్లలో కొత్తగా, సన్నగా మార్చేసి విపణిలో రూ. 40 వరకూ అమ్మకాలు జరుపుతున్నారు.

No comments:

Post a Comment