హైద్రాబాద్, అక్టోబరు 22 (way2newstv.in)
మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే భార్గవ్‌పై కేసులు నమోదుకాగా.. తాజాగా అఖిలప్రియతో పాటూ భర్త పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులపై భార్గవ్‌తో పాటు అనుచరులు దురుసుగా ప్రదర్శించారని.. విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వస్తున్నాయి.హైదరాబాద్ యూసుఫ్ గూడలో భార్గవ్‌కు సంబందించిన స్కూల్‌లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్‌తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడగా.. కొంతమంది అనుచరుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మరో వివాదంలో అఖిలప్రియ
దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.మరోవైపు పోలీసులు తమపైనేదౌర్జన్యం చేశారని అఖిల ప్రియ ఆరోపించారు. తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారని అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అయితే కేసుల విచారణకు అఖిలప్రియ భర్త భార్గవ్ సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.అఖిలప్రియ భర్త భార్గవరామ్ బిజినెస్ పార్ట్‌నర్‌పై దాడి చేసినట్లు ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. తర్వాత వ్యాపార లావాదేవీల్లో వివాదం మొదలయ్యింది. ఈ క్రమంలోఅఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం చేశారని శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవరామ్‌తో పాటు మరో 10 మందిపై కేసు నమోదయ్యింది. అఖిలప్రియ భర్తపై రెండు కేసులు ఫైలయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ ఎస్‌ఐ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో భార్గవరామ్ పోలీసులకు కనిపించారని.. కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ అంటున్నారు. అంతేకాదు కారుతో తమనను ఢీకొట్టేందుకు ప్రయత్నించారని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఐపీసీ సెక్షన్లు 353, 336 కింద భార్గవరామ్‌పై కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment