Breaking News

22/10/2019

మిషన్ భగీరథ, 30 రోజుల గ్రామ ప్రత్యేక కార్యాచరణ పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సమీక్ష

మంచిర్యాల- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పనుల పురోగతిపై అధికారులతో సమావేశం
మంచిర్యాల,  అక్టోబరు 22 (way2newstv.in
మిషన్ భగీరథ  పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల  జిల్లా సీసీసీ కార్యాలయంలో మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లు భారతి హోళీ కేరి,  రాజీవ్ గాంధీ హనుమంతుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి అత్యంతప్రాధాన్యత నిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే సిఎం కెసిఆర్ ఆశయమని, దానికనుగుణంగా ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 
మిషన్ భగీరథ, 30 రోజుల గ్రామ ప్రత్యేక కార్యాచరణ పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సమీక్ష

క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో వేగంగా పని చేయించుకోవాలని సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 30 రోజుల గ్రామ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో ప్రజల్లో పరిశుభ్రత ,పచ్చదనం పై అవహగన పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రత్యేకాధికారులు ల్,ఎంపిడివో లతో 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ లో ఎమ్మెల్యేలు, జడ్పిటిసి లు, ఎంపిటిసి, సర్పంచ్ లు ,అదికారులు అందరి సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు అభినందించారు.కార్యాచరణ ప్రణాళిక  ప్రజల్లో చైతన్యం, కదలిక వచ్చిందన్నారు.తమ ఊరిని తాము పచ్చదనం పరిశుభ్రతతో ఉంచుకోవాలనే చైతన్యం వచ్చిందన్నారు.అధికారులు ఇదే స్ఫూర్తితో ప్రతి వారం మండలంలోని గ్రామాలను సందర్శించాలన్నారు.అలాగే ప్రతి నాలుగు నెలలకోసారి 10 రోజుల పాటు  కార్యచరణ ప్రణాళిక ప్రకారం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కొనప్ప, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్,ఎమ్మెల్సీ పురాణం సతీష్ మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, జిల్లా కలెక్టర్లు భారతి హోళికేరి ,రాజీవ్ గాంధీ హనుమంతు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment