Breaking News

22/10/2019

తాత్కాలిక సిబ్బందిని బెదిరించకూడదు

మహబూబ్ నగర్ అక్టోబరు 22, (way2newstv.in)
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని, ప్రజలకు అసౌకర్యం కల్గించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్.పి. ఎన్.వేంకటేశ్వర్లు అన్నారు.  మంగళవారం ఉదయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అయన మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ  కార్మికులు చట్టానికి లోబడి నడుచుకోవలసి ఉంటుందని అన్నారు. సమ్మె చేసే ఆర్టీసీ  కార్మికులను ఇకముందు డిపో వద్దకు గానీ, బస్ స్టాండ్ గేట్ల వద్దకు గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని అన్నారు. 
తాత్కాలిక సిబ్బందిని బెదిరించకూడదు

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. సమ్మె సందర్భంగా చట్టవిరుద్దంగా ప్రవర్తించిన వారిపై  కేసు నమోదు చేస్తూ,  కేసు వివరాలను సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుంది. ఈ కేసుల వలన ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని అయన హెచ్చరించారు. బస్ స్టాండ్ లో ఇప్పటికే సి.సి. కెమెరాలు ఉన్నాయి. ఈరోజు మరో ఇరవై సి.సి. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. గొడవలు సృష్టించి ప్రయాణీకులకు ఆటంకం కల్గించేవారి వివరాలు నిఘా కెమెరాల ద్వారా ప్రత్యక్ష సాక్ష్యాలుగా తీసుకుంటామన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను బస్ స్టాండ్, బస్ డిపో పరిసరాలకు అనుమతించమని అన్నారు. జిల్లాలోని అన్ని రహదారులపై ప్రత్యక బలగాల పెట్రోలింగ్ ఏర్పాటు చేసాం.  ఇరవైనాలుగు గంటల పాటూ గట్టి నిఘా ఉంటుందని అయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు చేపడతామని, పోలీసు బందోబస్తుకు అందరూ సహకరించాలని అయన విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment