చేసుకున్న "అభిషేక్ పిక్చర్స్ - అభిషేక్ నామా "*
నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ
రేట్స్ కి సొంత చేసుకుంది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్,రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" హక్కులను పొందడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.రీసెంట్ గా రిలీజ్ అయిన "జార్జ్ రెడ్డి" ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
"జార్జ్ రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం
ఒక్క ట్రైలర్తోనే సినిమా బిజినెస్ కావడం విశేషం.గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్,చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీనిఅందించారు."జార్జిరెడ్డి "చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. . ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.
No comments:
Post a Comment