Breaking News

10/10/2019

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ

ఈ నెల15 కి వాయిదా
హైదరాబాద్ అక్టోబరు 10, (way2newstv.in)
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో గురువారం వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాగా,   ఆర్.టి సమ్మె పై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి.  సమ్మె ను నివారించేలా వెంటనే హై కోర్ట్ ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వం, ఆర్టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె ను నిలిపివేసేవిధం గా ఆదేశాలు ఇవ్వాలి. సమ్మె వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత తొందరగా సమస్య ను పరిష్కరించే విధంగా చూడాలని పిటీషనర్ కోర్టును కోరారు. ఆర్టీసీ ఐకాస తరపున రచన రెడ్డివాదించారు. 
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ

రచన రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారు. 30 రోజుల ముందే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నుకోరారు. 3, 24, 26 తేదీల్లో ఆర్.టి సి కి, ప్రభుత్వం కి నోటీసులు ఇచ్చాం. తమ డిమాండ్లు పరిష్కరించలేదు అనే సమ్మె కు వెళ్ళామని వివరించారు. కార్పస్ న్ ఫండ్స్ 545 కోట్లు తోపాటు ప్రభుత్వ రాయితీ సొమ్ము చెల్లించాలని అన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే..కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని చెప్పారు.  ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన రామచందర్ రావు మాట్లాడుతూ ఆర్.టి.సి కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే.  కార్మికుల సమస్య ను పరిష్కరించేందుకుగత నెల 29 న కమిటీ నియమించింది. కార్మికుల డిమాండ్ పరిష్కరించేలోపే సమ్మె బాట పట్టారు. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..విచారణనను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment