రామ రాజ్యం జగనన్నతోనే సాధ్యం ప్రదీప్ రెడ్డి
కౌతాలం అక్టోబర్ 15 (way2newstv.in)
వైయస్ఆర్ రైతు భరోసా పథకం అన్న దాతలకు ఓ వరం లాంటిదని రాష్ట్ర యువజన సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్లే గ్రౌండ్ నందు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు.ముందుగా వ్యవసాయ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రదీప్ రెడ్డి కు ఘన స్వాగతం పలికారు. బారి ఘజమలతో సత్కరించారు. దీపాలను వెలిగించి సభను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర యువజన సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మెహన్ రెడ్డి గారు రైతు భరోసా పథకం కింద 12,500 నుంచి 13,500లకు పెంచినట్లు తెలిపారు.మనది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వమ ని , మన ప్రభుత్వంలో రైతె రాజు అని,నియోజకవర్గంలో అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని పేర్కొన్నారు.
అర్హులందరికీ వైయస్ఆర్ రైతు భరోసా పథకం
మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం అన్నదాతలకు అందించాలన్సిన బాధ్యత అధికారులు, పార్టీ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. నవంబర్ 15 వరకు గ్రామాల్లో పెండింగ్ లబ్ధిదారుల దరఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలని సూచించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తూన్నట్లు తెలిపారు. అన్నదాతలకు అండగా ఉండి పెట్టుబడి సహయం కింద రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ పధకం కింద 5510 కోట్లు మన ప్రభుత్వం విడుదల చేసింది అని వివరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగొలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ధరలస్థీరికరణను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు రైతుల గురించి మాట్లాడారు. అనంతరం రైతులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకట రమణ, ఏఈఓ శేషాద్రి ఎస్ ఐ నాగార్జున రెడ్డి వైసీపీ నాయకులు దేశాయి కృష్ణ,వీరుపక్షప్పా, నాగరాజు గౌడ్, కృష్ణం రాజు,అవతారం ప్రభుత్వ అధికారులు ,కార్యకర్తలు, అన్ని గ్రామాల్లో రైతులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment