హైదరాబాద్, ఆగస్టు 22 (way2newstv.in)
భారత ప్రభుత్వం లో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల కోసం 230 కేటగిరీ లకు చెందిన 1351 ఖాళీల (టెంటేటివ్) భర్తీ కి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిఇ) పద్ధతి లో రిక్రూట్‌మెంట్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) నిర్వహించనుంది. అర్హత ప్రమాణాలు, ఇతర నియమ నిబంధనల తో కూడిన వివరణాత్మక ప్రకటన , ఇంకా దరఖాస్తు పత్రాలు కమిషన్ వెబ్ సైట్ తో పాటు సదరన్ రీజినల్ ఆఫీస్ వెబ్‌సైట్ లో లభ్యం అవుతాయి.
సెలక్షన్ పోస్టు ల కోసం ఎస్ఎస్‌సి రిక్రూట్‌మెంట్
ఎస్ఎస్‌సి రీజనల్ డైరెక్టర్ జారీ చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం, చెన్నై లోని ఎస్ఎస్‌సి సదరన్ రీజియన్ కు సంబంధించి 17 కేటగిరీల లో 67 ఖాళీలుకూడా ఈ ప్రకటన లో భాగం అయి ఉన్నాయి. రిజర్వేషన్ కు అర్హత కలిగిన ఎస్ సి/ఎస్ టి/ఇఎస్ఎమ్/పిడబ్ల్యుడి (ఒహెచ్/హెచ్ హెచ్/విహెచ్/ఇతరులు) కేటగిరీల కు చెందిన అభ్యర్ధుల కు మరియు మహిళా అభ్యర్ధులందరికీ ప్రభుత్వ ఆదేశాల ను అనుసరించి రుసుము మినహాయించబడింది.అర్హులైన అభ్యర్ధులు కమిషన్ యొక్క వెబ్‌సైట్ ద్వారా 2019వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పరీక్ష 2019వ సంవత్సరం అక్టోబరు 14వ తేదీ నుండి 2019వ సంవత్సరం అక్టోబరు 18వ తేదీ మధ్య నిర్వహించబడే అవకాశం ఉంది.
No comments:
Post a Comment