Breaking News

22/08/2019

వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు సహకరించాలి

వై.సి.పి నాయకులు జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు ఆగష్టు 22 (way2newstv.in)  
వినాయక చవితి ఉత్సవాలను ప్రతిఒక్కరు ఐక్యమత్యంగా జరుపుకోవాలని  వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాల్ లో శ్రీ గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక కమీటీ లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమీషనర్ రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన వివిధ అధికారులతో కౌన్సిల్ హాల్ లో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పలు డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ  రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు తీసుకోవాల్సిన సూచనలు, జాగ్రత్తల గురించి తెలియజేశారు. 
వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు సహకరించాలి

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకాష్ జైన్,కామర్తి నాగేశప్ప లు మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన చోట శుభ్రంగా ఉంచాలని, చుట్టుపక్కల పౌడర్ ను చల్లాలని, నిమజ్జనం రోజు పెద్ద కాలువకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెండు క్రేయిన్ లను,అలాగే గజ ఇతగాళ్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు వారు కోరారు. దీనికి కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలువ దగ్గర విద్యుత్ దీపాలు మరియు మీరు ఆడిగినవి అన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి  వినాయక కమిటీలతో మాట్లాడుతూ మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న నన్ను కలవొచ్చు అని ఆయన అన్నారు.సి.ఐ,ఎస్సైలు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సిఐ మహేశ్వర రెడ్డి,ఎస్ఐ లు శ్రీనివాసులు, రామసుబ్బయ్య, ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సరస్వతి, డిఈఈ వెంకటేశ్వర్లు,విద్యుత్ శాఖ ఏడి వీరేశ్, ఏయి ప్రసన్నకుమార్, వైసిపి నాయకులు బుట్టారంగయ్య, శ్రీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు యు.కె రామకృష్ణ, ధర్మగుణ, శ్రీనివాసులు,మురళీకృష్ణ, మధు,రాము,గిరి,కృష్ణవేణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment