Breaking News

13/08/2019

ఉనికి కోసమే కాంగ్రెస్ పై విమర్శలు

మహబూబ్ నగర్ ఆగస్టు 13,(way2newstv.in - Swamy Naidu):
తెలంగాణ లో ఉనికి కోసమే బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు  చేస్తోంది. 2018 ఎన్నికల్లో 103 నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్స్ రాలేదు . లోక్ సభ ఎన్నికల్లో కేవలం 17 శాతం ఓట్లు వచ్చాయి . ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో బీజేపీ ఊసే లేదని మాజీఎంపీ, కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం అయన మీడియతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తోక పార్టీగా మారింది . కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ తోక పార్టీ అయితే .. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ తోక పార్టీగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది . రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రులు ఆహా .. ఓహో అనడం నిజం కాదా అని అడిగారు. 

 ఉనికి కోసమే కాంగ్రెస్ పై విమర్శలు
ఈ రెండు ఉదాహరణలు చాలదా .. మీ తోక పార్టీల బంధం గురించి చెప్పడానికి. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు . మోడీ .. కేసీఆర్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది . బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాటలు చూస్తుంటే .. దొంగనే .. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని అన్నారు. లక్ష్మణ్  మతిస్థిమితం తప్పి కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు .. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకుల మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీకి సమర్థవంతమైన నాయకులు .. క్యాడర్ లేదు .. అందుకే ఇతర పార్టీ నాయకులను చేర్చుకునేందుకు వాళ్ళ ఇళ్ళచుట్టు తిరుగుతున్నారు. బీజేపీలో చేరికలు తాత్కాలికమేనని అన్నారు. 

No comments:

Post a Comment