Breaking News

13/08/2019

రైతే రాజు కావాలి.... గ్రామాలలో పండుగ వాతావరణం

ధరూర్, ఆగస్టు 13,(way2newstv.com - Swamy Naidu):
మంగళవారం ధరూర్ మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. మంగళవాయిద్యాలతో  ఎంపీ రాములు,   తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య చైర్మన్ గట్టు తిమ్మప్ప,   ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,   జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత,  వైస్ చైర్ పర్సన్ సరోజమ్మా,  గద్వాల  పరిసర గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.  వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు రిజర్వాయర్ గేట్ వాల్ తిప్పి కాలువలకు నీరు విడుదల చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమం కిందా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపిరాములు మాట్లాడుతూ  తెలంగాణ లో  ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండుకోవడం శుభపరిమాణం. జూరాల, శ్రీశైలం, సాగర్ నుంచి మన ప్రాంతంలో ఉన్న అన్నీరిజర్వాయర్లును నీటితో నింపి వ్యవసాయానికి సాగునీరందిస్తామన్నారు. 

రైతే రాజు కావాలి....గ్రామాలలో పండుగ వాతావరణం
తెలంణాలో ప్రాజెక్టులకు ఆ జళకళరావడం జరిగింది.  సిఎం కేసిఆర్ అపర భగీరథ ప్రయత్నం విజయవంతం అయింది.  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ  ఇవ్వాళ గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. అన్నదాతల ప్రతి ఇంటిలో భక్షాలు చేసుకుని పండుగ జరుపుకుంటున్నారు. నెట్టెంపాడు...ర్యాలంపాడు రిజర్వాయర్ ల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందించి పచ్చని గ్రామాలుగా మారుస్తున్నారు.సిఎంకేసిఆర్ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని .రైతుబందూ, రైతు బీమా  నిరంతరం విద్యుత్ వంటిపథకాలు ప్రవేశపెట్టి రైతు శ్రేయస్సుకు కృషి చేస్తున్నారన్నారు.ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. జూరాల డ్యాంకు వచ్చే వరద నీటిని నెటెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లలో నింపుతున్నట్లు తెలిపారు చెరువులు, కుంటల్లోకి నీటిని పంపేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు

No comments:

Post a Comment