Breaking News

10/08/2019

సిటీలో వేగంగా కొనసాగుతున్న ఫ్లైఓవర్లు

హైద్రాబాద్, ఆగస్టు 10, (way2newstv.in)
మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో ముఖ్యమైన మరో ప్రాజెక్టు పూర్తయింది. ఇప్పటికే అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ వంటివి అందుబాటులోకి వచ్చి పరిసర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ నుంచి కొంత మేరకు ఉపశమనం కల్గించారు. కంచన్‌బాగ్ వంటి ప్రాంతంలో ఎస్‌ఆర్‌డీపీ పనులకు కొంతకాలం క్రితం వరకు ఎదురైన అడ్డంకులు సైతం తొలిగిపోవటంతో రేపోమాపో పనులు ఊపందుకోనున్నాయి. ఎల్‌బీనగర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు, పాదచారులకు కొంత ఇబ్బందులు తగ్గే అవకాశముంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ఎల్‌బీనగర్ చౌరస్తాలో ప్రస్తుతం గంటకు 11వేల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు అధ్యయనంలో తేల్చారు. 
సిటీలో  వేగంగా కొనసాగుతున్న ఫ్లైఓవర్లు

వాహనాల సంఖ్య 2034 వరకు గంటకు 17వేలకు పెరిగే అవకాశమున్నట్లు నిర్దారించారు. 12 మీటర్ల వెడల్పు, 940 మీటర్ల పొడువు గల ఈ ఫ్లై ఓవర్‌ను రూ. 49 కోట్లను వెచ్చించి, క్షేత్ర స్థాయిలో ఎదురైన అనేక రకాల అడ్డంకులను అధిగమించి, రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు.ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలు సాగించే సుమారు 90 శాతం వాహనాలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సజావుగా ప్రయాణించే అవకాశమేర్పడుతోంది. ఈ ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా ఎల్‌బీనగర్‌లో రూ.42.74 కోట్ల వ్యయంతో మరో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.ఈ జంక్షన్‌లో గంటకు 15వేల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ సంఖ్య 2034కల్లా 22వేలకు పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. 780 మీటర్ల పొడువు, 12 మీటర్ల వెడల్పుతో ఎల్‌బీనగర్ ఎడమవైపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్‌బీనగర్ జంక్షన్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు 147 మీటర్లు, విజయవాడ వైపు 213 మీటర్ల పొడవులో ఈ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి.కామినేని ఆసుపత్రి వైపు నుంచి నాగార్జున సాగర్ క్రాస్‌రోడ్డు జంక్షన్ వైపు సులువుగా వాహనాలు ప్రయాణం చేయడానికి 520 మీటర్ల పొడువుతో అండర్‌పాస్ నిర్మాణం మున్మరంగా సాగుతవంది. 25.75 మీటర్ల వెడల్పుతో 72.50 మీటర్ల పొడువు గల క్లోజ్‌డ్ బాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సాగర్ రింగ్ రోడ్డు వైపు 165.75 మీటర్ల పొడువు, నాగోల్ వైపు 291.75 మీటర్ల పొడువుతో ఈ అండర్‌పాస్ నిర్మాణమవుతోంది.డిసెంబర్‌లో ప్రారంభించాలనే లక్ష్యంతో పనులను ముమ్మరం చేశారు. బైరామల్‌గూడలో రూ. 38.27 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం పనులను చేపట్టారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో 780 మీటర్ల పొడువున దీని నిర్మాణం చేపట్టారు. రూ.64.42 కోట్ల వ్యయంతో నాగోల్ జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టారు. వెయ్యి 40 మీటర్ల పొడువు, 12 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఉప్పల్ వైపు 180 మీటర్ల పొడువు, ఎల్‌బీనగర్ వైపు 170 మీటర్ల పొడువుతో దీని నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment