Breaking News

10/08/2019

ఆహార భద్రత కార్డుల కోతకు శ్రీకారం

వరంగల్, ఆగస్టు 10, (way2newstv.in)
వరంగల్ జిల్లాలో ఏప్రిల్‌ మాసంలో బిపిఎల్‌, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 10లక్షల 88వేల 206 ఉన్నాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించిన క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఒక్క కార్డుపైనా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏప్రిల్‌ మాసంలో 10లక్షల 88వేల 206 కార్డులు ఉండగా జూలై మాసం నాటికి 9లక్షల 66వేల 335 కార్డులకు కుదించారు. అంటే లక్షా 21వేల 871 కార్డుల్ని తొలగించారు. ఆహార భద్రత కార్డుల కోతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త కార్డుల జారీని పక్కకు పెట్టి పాత కార్డుల్ని ఏరివేస్తుంది. ఆధార్‌తో కార్డులకు లింక్‌ చేసింది. నాలుగు మాసాలుగా జిల్లాలో లక్షా 22వేల కార్డుల్ని ఏరివేశారు. 
ఆహార భద్రత కార్డుల కోతకు శ్రీకారం

ప్రతి నెలా 2వేల నుండి 3వేల కార్డుల్ని తొలగిస్తున్నారు. వరుసగా మూడు మాసాలు రేషన్‌ సరుకులు పొందకుంటే కార్డులు పోయినట్లే.  ఈ లెక్కన రానున్న రోజుల్లో మరింతగా కార్డుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకే వ్యక్తి ఉంటే ఆ కార్డుని తొలగిస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల పేర్లను నమోదు చేసినా తీసేస్తున్నారు. ఫిర్యాదుల్ని కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చేయాలని సూచిస్తున్నారు. ఇలా సామాన్యుల డొంకలు నింపే కార్డుల ఏరివేతకు ప్రభుత్వం ఒడిగట్టడంతో రోజు రోజుకు కార్డుల సంఖ్య తగ్గుతున్నాయి. నాలుగు మాసాల్లోనే లక్షా 22వేల కార్డుల్ని కుదించారంటే భవిష్యత్తులో కార్డులు ఉంటాయా..లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆధార్‌తో రేషన్‌కార్డుల్ని లింక్‌ చేశారు. లబ్ధిదారుల ఆధార్‌ కార్డు నెంబర్‌ నమోదు చేయడంతో ఎక్కడెక్కడ డబుల్‌ కార్డులు ఉన్నాయో తెలిసిపోతుంది. దీంతో ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండానే కార్డుని  తొలగిస్తున్నారు. గత నాలుగైదేళ్ల నుండే రేషన్‌ కార్డులకు ఆధార్‌ను లింక్‌ చేశారు. అయితే ఇప్పుడు అన్ని శాఖలకు రేషన్‌కార్డును లింక్‌ చేశారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిపొందిన వారి పేర్లును కూడా పసిగడుతున్నారు. ఏ చిన్న లోపం కనిపించినా కార్డును తొలగిస్తున్నారు. తల్లి, బిడ్డలకు సబంధించి కార్డు వేరువేరుగా ఉన్నా తొలగిస్తున్నారు. ఇలా చిన్న చిన్న కారణాలతో కార్డులు తొలగిస్తున్న పరిస్థితి ఉంది.  రేషన్‌ కార్డులు తొలగించడంపై అధికారులు వివిధ కోణాలను అన్వేషిస్తున్నారు. మూడు మాసాలుగా సరుకులు తీసుకోని వారి కార్డుల్ని తొలగిస్తున్నారు. గతంలోనే ఈ ప్రక్రియకు ఒడిగట్టడంతో 60వేల కార్డులు తొలగించబడ్డాయి. వాటిని పునరుద్ధరించలేదు. ఇప్పుడు మళ్లీ ఆ చర్యకు పూనుకున్నారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వలస వెళ్లిన కారణంగా సరుకులు తీసుకున్నా వారి కార్డు తొలగించ బడుతుంది. ఇలా అనేక మంది పేదల కార్డులు తొలగించ బడుతున్నాయి. బియ్యం తదితర సరుకులు ప్రతి నెలా మొదటి వారంలో సరఫరా చేస్తుండగా కిరోసిన్‌ ప్రతి నెలా చివరన సరఫరా చేస్తున్నారు.తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిచింది. దీంతో సుమారు రెండున్నర లక్షలకు పైగా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఎవరికీ కొత్త కార్డులు జారీ చేయలేదు. పాత కార్డుల్ని గులాబి కార్డులుగా జారీ చేస్తామని ప్రకటించారు. కార్డులు మార్చి సరఫరా చేయకపోగా కొత్త కార్డులు ఇవ్వలేదు. పైగా పాత కార్డుల్ని వివిధ కారణాలతో తొలగిస్తున్నారు. కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భారీగా కార్డుల్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment