Breaking News

22/08/2019

చిదంబరం అరెస్టును ఖండించిన కాంగ్రెస్‌

అతని మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు
న్యూఢిల్లీ ఆగష్టు 22 (way2newstv.in
కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అరెస్టును కాంగ్రెస్‌ ఖండించింది. ఢిల్లిలోని సీబీఐ కార్యాలయం ఎదుట నేషనల్ యూత్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. చిదంబరాన్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. సీబీఐ, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని కాంగ్రెస్ ఆరోపించింది.  పార్టీ నేతలు రణ్‌దీప్‌ సుర్జేవాలా, సల్మాన్‌ ఖుర్షిద్‌  మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శానాస్త్రాలు సంధించారు. సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయంటూ మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను కేంద్రం చేతిలోకి తీసుకుంది. 
చిదంబరం అరెస్టును  ఖండించిన కాంగ్రెస్‌

వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటోంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించే వారినే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి, రూపాయి విలువ క్షీణత వంటి తీవ్రమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చిదంబరం అరెస్టు డ్రామా ఆడుతున్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ మాటల ఆధారంగా..40ఏళ్ల నుంచి ప్రజా సేవ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తారా? చిదంబరం మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం చార్జిషీట్‌ కూడా లేదు. ఇక సీబీఐ, ఈడీ అధికారుల తీరు కూడా అదే విధంగా ఉంది. రాజకీయ నేతల దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవడానికి వత్తాసు పలుకుతున్నారు. లేకపోతే చిదంబరాన్ని అంత హడావుడిగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? చిదంబరాన్ని అరెస్టు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రధాని నరేంద్ర మోదీకి ఈడీ, సీబీఐ అధికారులు చెబుతారని ఆశిస్తున్నాను’ అంటూ ముగించారు.చిదంబరం అరెస్టు ఎంతో బాధించిందని, సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు కూడా ఆగకుండా ఆయనను అరెస్టు చేశారన్నారు. చిదంబరం మీద ఎలాంటి కేసు ఉండదని ఆశిస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment