Breaking News

16/07/2019

జిల్లాలపై కలెక్టర్ల ముద్ర పడాలి

అమరావతి, జూలై 16 (way2newstv.in)
స్కూలు, ఆస్పత్రుల దశ దిశ మార్చాలి, కలెక్టర్లకు మంచి పేరు రావాలి. జిల్లామీద కలెక్టర్ సంతకం కనిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన స్పందన కార్యక్రమంపై సమావేశం నిర్వహంచారు. మీరు అందరూ చేయగలుగుతారనే నమ్మకం ఉంది. అన్ని జిల్లాల్లో ఉన్న స్కూళ్లు, హాస్టళ్ల మెరుగుదల కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటి ఫొటో, అప్పటి ఫొటోలు తీసి ప్రజలకు చూపించే పరిస్థితి ఉండాలి. స్కూళ్లలో కనీస సదుపాయాలు ఉన్నాయో, లేదో గుర్తించాలని అన్నారు. బాత్ రూమ్స్, తాగునీరు, కాంపౌండ్వాల్æ,  ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్స్, ఫ్యాన్స్,  పెయింటింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాధాన్యతా క్రమంలో చేయాలి. ప్లే గ్రౌండ్స్కూడా ఉండేలా చూసుకోవాలి. 
జిల్లాలపై కలెక్టర్ల ముద్ర పడాలి

తి స్కూల్లోనూ ఈ కనీస సదుపాయాలు ఉండాలని అన్నారు. ఈ ఏడాది మనం పాఠ్యప్రణాళికను మారుస్తున్నాం. దీనిమీద నిపుణుల కమిటీ పనిచేస్తోంది. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తాం, తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్. మద్యాహ్నం భోజనం చాలా క్వాలిటీతో ఉండాలి. ఆయాలకు, సరుకులకు సరైన సమయంలో ఇస్తున్నామా? లేదో చూడాలి?: ఆలస్యమైతే వెంటనే నన్ను అప్రమత్తం చేయండని సూచించారు. 6, 8 నెలలు వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని పిల్లలకు మంచి భోజనం పెట్టమని ఎలా అడగగలమని అన్నారు. పేదవాళ్లు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదు. యూనిఫారమ్స్, పుస్తకాలు కూడా సరైన టైంకు ఇవ్వాలి. పేరెంట్స్కు బట్ట ఇచ్చి, స్టిచ్చింగ్ ఛార్జీస్ ఇవ్వాలని అన్నారు. ఏ టైంలో ఏం చేయాలో అది కచ్చితంగా చేయాలి. జూన్ మొదటివారం నాటికి ఇవన్నీ అందాలి. ఆస్పత్రులమీద కూడా ఇదే తరహా దృష్టి సారించాలని అన్నారు.

No comments:

Post a Comment