Breaking News

16/07/2019

చెట్ల సంరక్షన సామాజిక బాధ్యత

వరంగల్లు  జూలై 16,(way2newstv.in):
మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని స్టేషన్ ఘన్ పూర్ శాసన సభ్యులు టి. రాజయ్య పేర్కొన్నారు. గతంలో ప్రతి రైతు తన పెరడు, పొలాల్లో స్వచ్చంధంగా చెట్లు పెంచేవారని తెలిపారు. మంగళవారం ధర్మసాగర్ మండలం ముప్పారం సమీపంలో ఉన్న ఇనుపరాతి గుట్టల అడవులలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అక్బర్లతో కలిసి హరితవనం క్రింద నిర్మించిన 1250 కాంటూర్ కందకాలపై 5 వేల మొక్కలను కూలీలో కలిసి సాముహికంగా నాటారు. విచ్చలవిడిగా నరుకుట వలన నశించిన అడవులు, చెట్లను పునరుద్ధిరించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో తెలంగాణకు హరితవనం   కార్యక్రమాన్ని రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. 
 చెట్ల సంరక్షన సామాజిక బాధ్యత

అడవుల విస్ఞిర్ణానని 35 శాతానికి పెంచినప్పుడే సకాలంలో వర్షాలు పడి, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. ఉఫాధి హామీ క్రింద సామాజిక వనరుల అభివృద్ధిలో భాగంగా చెట్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు చుప్పారు. హరితహరం ప్రభుత్వం కోసం కాదని ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమం అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాయితీ రాజ్ చట్టం లో ప్రభుత్వం స్పష్టం మైన నిబంధన రూపొందినట్లు తెలిపారు. బంగారు తెలంగాణలో హరితహరం భాగమని చెప్పారు.జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మం.సుదీర్ కుమార్ మాట్లాడుతూ, ఒక వైపు మొక్కలు నాటుతుంటే మరోవైపు చెట్లను నరికి కలపకు, బొగ్గుకు వాడడం జరుగుతుందన్ని వాపొయారు. చెట్లను నరకడం వలన అందరికి నష్టం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు ప్రదర్శించిన ప్లే-కార్డులలలో ఉన్న నినాదాలను అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. టెక్స్ టైల్ పార్కుకు 5 ఎకరాలలో బ్లాక్ స్లాంటేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు.కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అక్బర్ మాట్లాడుతూ, అడవుల సంరక్షణతో ఎటో-టూరిజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భూ మాఫియా నుండి అడవులను కాపాడుటలో సహకరించాలని ప్రజలకు చేశారు. ముప్పసరం,కొత్తపల్లి అడవులను హరితవనం మోడల్ క్షేత్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎఫ్.ఓ. రామలింగం, డి.ఆర్.డి.ఓ-రాము, జెడ్.పి.సిఇఓ ప్రసూన రాణి, ఎం.పి.పి హరిత, జెడ్.పా.టి.సి.శ్రీలత, జెడ్.పి. కోఆప్షన్ యోంబర్  జుబేద, ఎం.పి.డి.ఓలు తహసిల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment