Breaking News

17/07/2019

అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న తీరు దారుణం: సంపత్ కుమార్

హైదరాబద్ జూలై 17  (way2newstv.in)
కేసీఆర్ పాలనలో అసెంబ్లీ సమావేశాలను జరుపుతున్న తీరు దారుణంగా ఉందని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.సార్థకత లేని అసెంబ్లీ సమావేశాలు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే జరుగుతున్నాయన్నారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ ని ప్రతిసారి తన రాజరికపు .. కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని దుయ్యబట్టారు.అసెంబ్లీలో బిల్లులపై పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా చర్చ జరిపే పరిస్థితులు లేవన్నారు.కేసీఆర్ తన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను .. అసెంబ్లీ లో ఆమోదింప జేసుకుంటున్నారని అన్నారు.తెలంగాణ శాసనసభకు కళంకం తెచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ తీసుకురాబోతున్న మున్సిపల్ చట్టంలో ఏముందో కేసీఆర్ కుటుంబానికి తప్పా వేరే ఎవ్వరికీ తెలియని పరిస్థితి అన్నారు.
 అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న తీరు దారుణం: సంపత్ కుమార్

మంత్రులు సైతం క్యాబినెట్ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్పా .. ఏంటని ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు.కేసీఆర్ ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారన్నారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది .. వర్షాలు లేక కరువు తాండవిస్తోందని,రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని,రైతుబందు డబ్బులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.పెట్టుబడి కోసం ఇస్తున్న ఈ డబ్బులు .. ఎప్పుడు ఇస్తున్నారు .. ఎలా ఇస్తున్నారు..తెలియని పరిస్థితి నెలకొందన్నారు.కేవలం ఓట్ల సమయంలోనే రైతుబందు డబ్బులు సమయానికి అందించి .. ఎన్నికల్లో లబ్ది పొందుతున్నారన్నారన్నారు. ఈ చర్యలు ఓట్ల కోసం .. సీట్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎన్నికలు .. రాజకీయాలు తప్పా వేరే అంశాలు పట్టడం లేదు ..ప్రజల సొమ్మును తన రాజాకీయ అవసరాలకు వాడుకొంటున్న కేసీఆర్ కు భవిష్యత్ లో జైలు తప్పదన్నారు.థాయిలాండ్ ప్రధానికి పట్టిన గతే .. కేసీఆర్ కు పడుతుందన్నారు.

No comments:

Post a Comment