Breaking News

05/07/2019

అమరావతి... నిలిచిపోయినట్లేనా


గుంటూరు, జూలై 5, (way2newstv.in)
 రాజధాని అమరావతి నిర్మాణంపై దాదాపు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించనుండటంతో రాజధాని నిర్మాణ పనులు దాదాపు నిలిచిపోనున్నాయి. టీడీపీ ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించేందుకు ప్రతిపాదించడం తెలిసిందే. అయితే రాష్ట్ర అధికార పగ్గాలను వైకాపా చేపట్టాక, రాజధాని అమరావతి నిర్మాణం పనులు నిలిచిపోయాయి. భూ సమీకరణ, వివిధ పనుల కాంట్రాక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వివిధ పనులు నిలుపుదల చేయడం తెలిసిందే.

అమరావతి... నిలిచిపోయినట్లేనా


 టీడీపీ ప్రభుత్వ హయంలో రాజధానిని దాదాపు 1.09 లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు తలపెట్టారు. ఇందులో భాగంగా వివిధ నిర్మాణాలకు 62 వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. రాజధాని పరధిలో ప్రస్తుతం దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతుండగా, మరో 4200 కోట్ల రూపాయల పనులు టెండరు దశలో ఉన్నాయి. మరో 7600 కోట్ల రూపాయల పనులకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ దశలో పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ కావడంతో రాజధాని నిర్మాణం సందిగ్ధంలో పడింది. ఇటీవల సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన అనంతరం రాజధాని నిర్మాణంలో అక్రమాల సంగతి తేల్చాకే పనులు చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడంతో రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయనవచ్చు. కానీ రాజధాని నిర్మాణంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నందున నిర్మాణ పనులను కొసాగించాలని కేంద్రం సూచించడం గమనార్హం. అయినప్పటికీ రాజధాని నిర్మాణంలో అవినీతీ సంగతి తేల్చాలని వైకాపా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రానున్న తొమ్మిది నెలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూర్పు చేస్తున్న బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి 340 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ప్రతిపాదిస్తున్నారు. బడ్జెట్ రూపకల్పన తుది దశకు వచ్చే సమయానికి ఈ మొత్తానికి స్వల్పంగానే మార్పులు ఉండే అవకాశం ఉంది. దీంతో రాజధాని నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమైనప్పటికీ, కొద్ది మొత్తంలో కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు పరిధిలోని నాగార్జున వర్సిటీ వద్దకు సచివాలయాన్ని మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో అరకొర నిధుల కేటాయింపు ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది

No comments:

Post a Comment