Breaking News

05/07/2019

జూలై 8 న తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్


హైద్రాబాద్,జూలై 5, (way2newstv.in)
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు నాలుగైదు రోజుల్లో విడుదల కానున్నాయి. జులై 8 లేదా ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు..

జూలై 8 న తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్

అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఇంటర్ సెకండియర్ విద్యార్థుల ఫలితాలు వెల్లడించిన మూడు లేదా నాలుగు రోజుల తర్వాత ప్రథమ సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 4,63,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,00,847 మంది, ద్వితీయ సంవత్సరం 1,62,389 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్థులు 1,48,463 మంది ఉండగా. మిగతావారు పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు ఉన్నారు. ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసం కనిపించింది. పరీక్షలు బాగానే రాసినప్పటికీ.. బోర్డ్ తప్పిదాల కారణంగా మార్కులు సరిగా వేయలేదని విద్యార్థులు ఆందొళనలు వ్యక్తం చేశారు. 90 శాతం మార్కులొచ్చిన విద్యార్థులు కూడా ఒక సబ్జెక్టులో ఫెయిలైనట్టుగా ఫలితాలు రావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయిన కారణంగా 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసిన బోర్డు.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో ఎవ్వరూ కూడా పాస్ అవ్వలేదని.. సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను కూడా విడతలవారీగా విడుదల చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల సహనాన్ని పరీక్షించింది. హైకోర్టు కూడా ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంగా చేసింది. 

No comments:

Post a Comment