Breaking News

04/07/2019

ఇక లెక్కలు తప్పవ్..(నిజామాబాద్)

నిజామాబాద్, జూలై 4 (way2newstv.in) : 

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు వారిలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వివరాలు ఇకనుంచి పక్కాగా చేపట్టనున్నారు. మొన్నటి వరకు కేవలం కాగితాలకే పరిమితమైన సంఘాల సభ్యుల వివరాలు, వారికి సర్కారు చేపడుతున్న పథకాలు, రుణాల మంజూరు, చెల్లింపులు తదితర వివరాలన్ని కేవలం దస్త్రాల ద్వారానే నిర్వహించేవారు. ఫలితంగా ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకునేవి.
ఇక లెక్కలు తప్పవ్..(నిజామాబాద్)

 అంతేకాక సభ్యులు తీసుకున్న రుణాలు సైతం పక్కదారి   పట్టే ఆస్కారం ఉండేది. వాటన్నింటికి చెక్‌ పెట్టి సంఘాల నిర్వహణను పక్కాగా, పారదర్శకంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందుకు గాను డిజిటల్‌ అకౌంటింగ్‌ పద్ధతిని అమలు చేస్తోంది.డ్వాక్రా సంఘాల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది.  పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్న సంఘాల వివరాలన్నింటిని డిజిటల్‌ అకౌంటింగ్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అందుకోసం ఐకేపీ ఏపీఎం, సీసీ, గ్రామ సమాఖ్య సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి గ్రామ సమాఖ్యకు ఒక ప్రత్యేక ట్యాబ్‌ను సైతం అందించారు. దాంతో పాటు వీఓఏ చరవాణిలో సైతం డిజిటల్‌ అకౌంట్‌కు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. వీటి సహాయంతో ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సంఘాల పేరుతో పాటు అందులో ఉన్న సభ్యుల వివరాలు, వారు తీసుకున్న రుణాలు, చేసిన వ్యాపారం, ఆర్జించిన లాభాలు, కుటుంబ ప్రగతి తదితర వివరాలన్నింటిని సభ్యురాలి పేరుతో ప్రత్యేకంగా నమోదు చేస్తారు. ఇలా చేసిన వివరాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, కేంద్రస్థాయి అధికారులు సైతం సమీక్షిస్తారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ అకౌంటింగ్‌ నమోదు ఉభయ జిల్లాల్లో వేగంగా సాగుతోంది. ఇప్పటికే గ్రామ సమాఖ్య సహాయకులకు, డ్వాక్రా సంఘాల   సభ్యులకు పథకంపై పూర్తి అవగాహన కల్పించారు.  అధికారులు రోజూ సమీక్షలు నిర్వహించి ఆన్‌లైన్‌ నమోదును పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 1,502 గ్రామ సమాఖ్యలుండగా ఇందులో 39,637 డ్వాక్రా సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 12మంది సభ్యుల చొప్పున మొత్తం దాదాపు 4.75 లక్షలకు పైగా డ్వాక్రా సంఘాల సభ్యులున్నారు. అయితే గత నవంబరులో సంఘాల డిజిటల్‌ అకౌంటింగ్‌ను ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు 20,150 సంఘాల లావాదేవీలు, దాదాపు 2.41 లక్షల మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగతా సంఘాల నమోదును సైతం వేగవంతం చేసి ఈ నెలాఖరుకు వందశాతం నమోదును పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ అకౌంటింగ్‌ ద్వారా డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డ తొలినాళ్ల సమాచారాన్ని సైతం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారఅందుకోసం పాత దస్త్రాలను తిరగేసిన ఐకేపీ అధికారులు మండలస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి,  దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సమాచారాన్ని మొదలుకొని 2018 మార్చి వరకు ఉన్న సమగ్ర వివరాలను డిజిటలైజ్‌ చేశారు. ఏప్రిల్‌ నుంచి మాత్రం గ్రామ సమాఖ్య సహాయకులకు బాధ్యతలు అప్పగించారు.డ్వాక్రా సంఘాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి ప్రతి సభ్యురాలి ఖాతాను డిజిటల్‌ ఖాతాగా మార్చడంతో అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, వారికి అందిస్తున్న రుణాల వివరాలు వెంటవెంటనే సభ్యులకు తెలుస్తాయి. వారికి మంజూరైన రుణాలను అందించడం, తిరిగి వాటిని చెల్లించే సమయాల్లో అవకతవకలకు అవకాశం ఉండదు.  సంఘాల ఉన్నతికి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా,  సక్రమంగా ఖర్చు చేసే వీలుంటుంది. రుణాలు తీసుకుంటున్న సభ్యుల కుటుంబం ఆర్థికాభివృద్ధిని సైతం   ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎంతవరకు దోహదపడుతున్నాయి, సభ్యులకు ఇంకా ఎలాంటి పథకాలు చేపట్టాలి అనే అంశాలపై తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.


No comments:

Post a Comment