Breaking News

04/07/2019

1300 కోట్లకు చేరుకున్న మిషన్ భగీరధ బకాయిలు


వరంగల్, జూలై 4, (way2newstv.in)
మిషన్‌ భగీరథ బకాయిలు భారీగా పెరుకుపోయాయి. ప్రభుత్వానికి, బ్యాంకర్లకు మధ్య జరిగిన మూడేండ్ల బప్పందం గత మార్చి 31తో ముగిసింది. అనంతరం మళ్లీ బ్యాంకర్లు, భగీరథ కార్పొరేషన్‌కు మధ్య ఒప్పందం జరగకపోవడంతో వర్కింగ్‌ ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. దాదాపు 15 బ్యాంకులకుపైగా ఉన్న కన్సార్టీయం భగీరథ కార్పొరేషన్‌కు రుణాలు ఇచ్చిన విషయం విదితమే. భగీరథ ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్‌) ప్రకారం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పూర్తి విలువ రూ. 45 వేల కోట్లు. దీనికి గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తపద్ధతిలో వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. 

1300 కోట్లకు చేరుకున్న మిషన్ భగీరధ బకాయిలు

అంతేగాక కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలైన నాభార్డు, హడ్కో సంస్థల నుంచి భగీరథ కార్పొరేషన్‌ రుణాలు తీసుకున్నది. వీటన్నింటితో మార్చి 31 నాటికి రుణ ఒప్పందాలు పూర్తయ్యాయి. మళ్లీ వాటిని పునరుద్ధరించే ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటున్నది. కాగా ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటిదాకా భగీరథ కాంట్రాక్టర్లకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. మొత్తం రూ. 45 వేల కోట్ల ప్రాజెక్టుకు గాను దాదాపు రూ. 25 వేల కోట్ల వరకు ఇప్పటి దాకా నిధులు ఖర్చుచేసినట్టు సమాచారం. ఇందులో ప్రధాన పనులతోపాటు గ్రామాల్లో జరిగే ఇంట్రా విలేజ్‌ నెట్‌వర్క్‌ పనులకు ప్రస్తుతం బిల్లులు ఆగిపోయాయి. దాదాపు రూ. 1300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం రూ. 1000 కోట్లు మాత్రమే ఇంట్రా కాంట్రాక్టర్లకు, ఇతరులకు చెల్లించాల్సి ఉందని అంటున్నారు. ఇందులో నాబార్డు నుంచి రూ. 100 కోట్లు రావాల్సి ఉంది. ఇటీవల ఆ బ్యాంకుతో ఒప్పందం కుదిరింది. కాగా మిగతా వాణిజ్య బ్యాంకులతో ఈ తరహా ఒప్పందాలు ఇంకా ఖరారు కాలేదు. దీంతో నిధులు కొరత ఏర్పడి ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్కింగ్‌ ఏజెన్సీలకు గత కొన్ని నెలలుగా బిల్లుల చెల్లించడం లేదు. కాగా ఇందులో ఇంట్రా విలేజ్‌ నెట్‌వర్క్‌ పనులకు సంబందించి దాదాపు రూ. 300 కోట్ల మేర చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇకపోతే మరో రూ. 1000 కోట్లు ప్రధాన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉందని అధికారిక సమాచారం.

No comments:

Post a Comment