లక్నో, జూలై 19 (way2newstv.in)
అఖిలేష్ యాదవ్ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించినప్పటికీ ఆ తర్వాత పార్టీని నడపడంలో మాత్రం అట్టర్ ఫెయిల్ అయ్యారన్నది వాస్తవం. ఈ వ్యాఖ్యలు ఎవరో బయట వ్యక్తులు చేసింది కాదు. సొంత పార్టీ నుంచే విన్పిస్తున్న విమర్శలు. వరస అపజయాలతో అఖిలేష్ యాదవ్ కు పార్టీలోనే అసమ్మతి పెరుగుతోంది. తిరిగి ములాయం సింగ్ యాదవ్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని, బాబాయి శివపాల్ యాదవ్ ను పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.అఖిలేష్ యాదవ్ 2017లో జరిగిన ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో హీరో. ఆయన వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రతి ఒక్కరూ నమ్మారు. ఎందుకంటే 2012 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 229 స్థానాలను సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. అలాగే 29.3 శాతం ఓట్ల శాతాన్ని సాధించింది.
అఖిలేష్.. ఫెయిల్యూర్ స్టోరీ
దీంతో ఒక్కసారి అఖిలేష్ హీరో అయిపోయారు. ములాయం సింగ్ కూడా కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిని చేశారు.కానీ 2017 ఎన్నికలకు వచ్చే సరికి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. యాదవ, ముస్లిం ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవచ్చని భావించారు. 2012 ఎన్నికల్లో 11.7 శాతం ఓట్లు సాధించి 28 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఆ పార్టీకి ప్రాధాన్యత సమాజ్ వాదీ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీని కూడా ఆ ఎన్నికల్లో పక్కన పెట్టింది. తీరా ఫలితాలను చూస్తే చావు దెబ్బ తినాల్సి వచ్చింది.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి మాయావతి బహుజన్ సమాజ్ పార్టీతో అఖిలేష్ యాదవ్ పొత్తు పెట్టుకున్నారు. పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రెండుసార్లు అఖిలేష్ పొత్తు ప్రయత్నాలు విఫలమయ్యాయని, పార్టీలో మార్పులు అవసరమన్న భావన నెలకొంది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో పార్టీ ఉంటే ఇక కోలుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే పెద్దాయన రంగంలోకి దిగారు. తనసోదరుడు శివపాల్ యాదవ్ తో చర్చించి తిరిగి సమాజ్ వాదీ పార్టీకి యూపీలో ఊపిరి పోయాలని ములాయం భావిస్తున్నారు. అఖిలేష్ వల్ల కానది పెద్దాయన వల్ల అవుతుందన్నది ఆ పార్టీ క్యాడర్ ఆశలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
No comments:
Post a Comment