Breaking News

19/07/2019

రూపాయికే రిజిస్ట్రేషన్

78 గజాల్లోపు ఉన్నఇళ్లకు అవకాశం 
హైద్రాబాద్, జూలై 19 (way2newstv.in)
తెలంగాణ అసెంబ్లీలో నూతన మున్సిపాలిటీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఈ చట్టంలోని కీలక అంశాలను సభ్యులకు వివరించారు. మున్సిపాలిటీల్లో పునరుత్తేజం నింపడం కోసం కొత్త చట్టం తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా పారదర్శకతను తీసుకొస్తామన్న ఆయన.. నూటికి నూరుపాళ్లు మానవ ప్రమేయం తగ్గించి.. పర్మిషన్లు వచ్చేలా చేస్తామన్నారు. నూతన చట్టం అమల్లోకి వస్తే.. పట్టణాల్లో పేదలకు 75 చ.గజాల స్థలం వరకు జీ+1 వరకు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి పన్ను కూడా ఏడాదికి వంద రూపాయిలు మాత్రమే. ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేసీఆర్ తెలిపారు. 
రూపాయికే రిజిస్ట్రేషన్

తద్వారా వారికి నల్లా కనెక్షన్ సహా అనేక సదుపాయాలు పొందే వీలుందన్నారు. ప్రజలను ఉద్యోగులు వేధించొద్దనే ఉద్దేశంతోనే నూతన చట్టం ప్రకారం ఉద్యోగులను మున్సిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ లోకల్ బాడీల మధ్య బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త డోర్ నంబర్ ఇస్తామన్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లను నిర్ణీత వ్యవధిలోనే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీలకు, అర్బన్ లోకల్ బాడీలకు ఆదాయం కూడా అవసరమన్న కేసీఆర్.. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం.. గ్రామీణ ప్రాంతాలకు రూ.3200 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1030 కోట్లు నిధులు ఇస్తోందన్నారు. కొత్త చట్టం ప్రకారం దీనికి సమంగా రాష్ట్రం కూడా నిధులు ఇవ్వనుందన్నారు. దీంతో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున నిధులు అందుతాయన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు నిరంతరం జరగాలన్న కేసీఆర్.. చట్టంలో ఉద్దేశపూర్వకంగా కలెక్టర్లకు కొన్ని అధికారాలు కల్పించామన్నారు. ఇకపై రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయి. బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, నిజాంపేట, మీర్‌పేట్ మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఉపాధి హమీ పథకం నిధులను పంచాయతీలు మాత్రమే ఖర్చు పెట్టేలా నిబంధనలను రూపొందించామన్న కేసీఆర్.. ఎన్నికల విషయంలో రాష్ట్రం జోక్యం చేసుకోదు, కానీ.. ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. మున్సిపల్ చట్టంలో పౌరులకు హితమైన పాలసీని రూపొందించామన్న సీఎం.. 500 చ.మీ. స్థలం, పది మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు మున్సిపల్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే పర్మిషన్ తీసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పర్మిషన్ రాకపోతే వచ్చినట్టుగానే భావించి నిర్మించుకోవచ్చన్నారు. అక్రమ కట్టడమైతే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. ఇంటి యజమానే స్వయంగా తన ఇంటి స్థలమెంతో చెప్పుకోవచ్చన్న సీఎం.. తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం 25 రెట్లు ఫైన్ కట్టాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టం ప్రకారం అక్రమ కట్టడం నిర్మాణం ప్రారంభిస్తే.. నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేస్తారని తెలిపారు. ఆగష్టు 15 నుంచి సమూల మార్పులు చూస్తారని కేసీఆర్ చెప్పారు. ‘హరితహారం కోసం మొక్కలు పెంచాలని బతిమాలినా ఉపయోగం లేకపోయింది. పోడు భూములకు పట్టాలిస్తాం. ఆ తర్వాత ఒక్క ఇంచు అటవీ భూమిని కూడా ఆక్రమించనివ్వబోం. పంచాయతీరాజ్ కార్యదర్శులకు కూడా పూర్తి జీతం ఇవ్వట్లేదు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు పెరిగితేనే.. మూడేళ్లలో ఉద్యోగం కన్‌ఫర్మ్ అవుతుంది. సర్పంచులకు కూడా ఆ బాధ్యత ఉంటుంది. లేకపోతే సర్పంచ్ పదవి పోతుంది. చెట్లు ఎలా పెరగవో మేం చూస్తాం. అక్రమాలను అరికట్టడానికి సర్జరీ అవసరం అందుకే కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ఈ చట్టానికి రూపకల్పన చేశామన్న కేసీఆర్.. ఎన్ని మొక్కలను పెంచాలనేది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయిస్తుందన్నారు. మొక్కలు సరఫరా చేశాక.. వాటిని పెంచే బాధ్యత స్థానిక కౌన్సిలర్, ఇంచార్జ్‌ది. మొక్కలు పెరగపోతే.. కౌన్సిలర్ పదవి పోతుంది. ఇంఛార్జ్ ఉద్యోగం పోతుందన్నారు. మూడేళ్లలో తెలంగాణలో అద్భుతం జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. ‘‘టీఎస్ ఐపాస్ తరహాలో పర్మిషన్లు ఇస్తాం. లే అవుట్ అప్రూవల్ జిల్లా కలెక్టర్ ఇస్తారు. ల్యాండ్ మాఫియా, అక్రమ దందాలు పోవాలి. దహన వాటికలు, ఖనన వాటికలు నిర్మించాల్సిన బాధ్యత సర్పంచ్‌దే. పంచాయతీ నిధుల నుంచే అవసరమైన స్థలం కొనుగోలు చేయాలి. పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి పది శాతం ఖర్చు పెట్టాల్సిందే’’నని కేసీఆర్ చెప్పారు. మున్సిపల్ చట్టం ఆమోదం పొందిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని భావించానన్న సీఎం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఈ చట్టాలను ముందే చదువుకోవడం మంచిదన్నారు. కలెక్టర్లు సర్పంచులను తొలగించినప్పుడు మంత్రులు స్టే ఇచ్చే అధికారాన్ని తొలగించామని చెప్పారుకొత్త మున్సిపల్ చట్టంలో పేదల కోసం పలు సదుపాయాలు కల్పించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని తెలిపారు. జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో ఈ చట్టం రూపకల్పన చేశాం. చట్టంలోని ప్రతి వాక్యం నేనే రాయించాను. భావితరాలకు బతకగలిగే పరిస్థితులను మనం అందించాలి. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం - 2019 ద్వారా పారదర్శకత వస్తుంది. అవినీతి రహిత మున్సిపల్‌ వ్యవస్థ నిర్మాణమవుతుంది’ అని కేసీఆర్ అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని అన్నారు. తప్పుడు సర్టిఫికేషన్‌ ఇస్తే 25 రెట్లు జరిమానా విధిస్తామని చెప్పారు. మున్సిపల్ చట్టం 2019 సహా మొత్తం 5 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. 

No comments:

Post a Comment