Breaking News

12/06/2019

ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగార్థులకు ఉచిత కోర్సులు


న్యూ డిల్లీ జూన్ 12 (way2newstv.in
ఎస్ సి,  ఎస్ టి లకు చెందిన ఉద్యోగార్థుల కు కొన్ని ఉచిత కోర్సుల‌ ను ప్రారంభించనున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వ కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ ఆధీనం లోని నేషన‌ల్ కెరియ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ ఫ‌ర్ ఎస్‌సి, ఎస్‌టి స్ తెలిపింది.  ఇంట‌ర్ మీడియ‌ట్‌, అంతకు మించిన విద్యార్హ‌త‌లు కలిగిన అభ్య‌ర్ధుల కు మొత్తం 3 కోర్సుల ను ప్రముఖ కోచింగ్ కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొంది.     ఈ మూడు కోర్సుల లో మొద‌టిది శిక్షణ కోర్సు.  దీనిని క్ల‌రిక‌ల్ కేడ‌ర్ పోస్టుల కోసం స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఐబిపిఎస్‌, ఎల్ఐసి త‌దితర సంస్థ‌లు నిర్వ‌హించే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉద్దేశించారు.  ఈ కోర్సు ను 60 మంది శిక్ష‌ణార్ధుల కు 2019 జులై 1వ తేదీ మొద‌లు 11 నెల‌ల పాటు ఈ శిక్షణ కోర్సు ను బోధించ‌నున్నారు.  దీనికి గరిష్ఠ వయస్సు పరిమితి 27 ఏళ్లు.రెండో కోర్సు కంప్యూట‌ర్ ‘ఒ’ లెవ‌ల్ కోర్సు. 


ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగార్థులకు ఉచిత కోర్సులు
 ఈ కోర్సు ను 25 మంది శిక్ష‌ణార్ధుల కోసం 2019 జులై 1వ తేదీ మొద‌లు ఒక సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించి, ఎన్ ఐఇఎల్ ఐటి సర్టిఫికెట్ ను ఇస్తారు.  ఈ కోర్సు లో చేరదలచే అభ్యర్థుల వయస్సు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక మూడో కోర్సు కంప్యూట‌ర్  హార్డ్ వేర్ మెయిన్‌టెనెన్స్ కోర్సు.  దీనిని 2019 ఆగ‌స్టు నెల 1వ తేదీ నుండి ఒక సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించి, ఎన్ ఐఇఎల్ ఐటి సర్టిఫికెట్ ను ఇస్తారు.   ఈ కోర్సు లో చేరదలచే అభ్యర్థుల వయస్సు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్ర‌తి ఒక్క ట్రయినీ కి 1,000 రూపాయ‌ల విలువైన పాఠ్య పుస్త‌కాల‌ ను ఉచితం గా ఇవ్వడం తో పాటు నెలకు 1,000 రూపాయల స్టయిపండ్ ను కూడా ఇస్తారు.  అయితే, లాడ్జింగ్ మ‌రియు బోర్డింగ్ స‌దుపాయాలు ఉండవు.  అభ్య‌ర్ధుల‌, త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3,00,000 రూపాయ‌ల‌ కు మించ‌కూడదు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ లో న‌మోదై ఉన్న, ఆస‌క్తి గ‌ల ఎస్‌సి, ఎస్‌టి అభ్య‌ర్ధులు పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ను నేష‌న‌ల్ కెరియ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ ఫ‌ర్ ఎస్‌సి, ఎస్‌టి, నేశ‌న‌ల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ క్యాంప‌స్‌ (ఇదివరకటి ఎ.టి.ఐ), విద్యాన‌గ‌ర్‌, హైద‌రాబాద్- 500 007 చిరునామా కు వెంట‌నే పంపించాలి.  అభ్య‌ర్ధులు వారి ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లన్నింటిని, ఆధార్ కార్డు కాపీ ని, బ్యాంకు ఖాతా కాపీ ని, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల‌ను జ‌త చేయవలసి ఉంటుంది.

No comments:

Post a Comment