Breaking News

15/06/2019

గంగ పుత్రుల ఆకలి ఘోష


కాకినాడ,  జూన్ 15, (way2newstv.in)
గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి ముందు వేట.. వెనుక అప్పులు అన్నచందంగా మారింది. మరో 24 గంటల్లో మత్స్యకారులు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. వేట నిషేధ సంధికాలం ముగియనుండటంతో మత్స్యకారులు వేటకు కావాల్సిన వలలు, పడవలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 60 రోజుల పాటు సముద్రంలో వేట లేక పూట గడవక నానా తంటాలు పడిన మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సంధికాలం ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం త్వరగా అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.ఆకలిని దిగమింగి నిత్యం బతుకు పోరాటం చేస్తున్న గంగపుత్రులకు వేట విరామంతో కడుపులు మాడుతున్నాయి. ఏడాదంతా పొట్ట నింపే మత్స్య సంపద వృద్ధి కోసం రెండుమాసాలు మత్స్యకారులు ప్రతి ఏటా ఆకలి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విరామం పాటిస్తున్న వారి ఆకలి తీర్చటంలో ప్రభుత్వాలకు తగిన శ్రద్ధ చూపట్లేదనే విమర్శలున్నాయి. వేట నిషేధ సమయంలో ఇచ్చే అరకొరా పరిహారం కూడా సకాలంలో ఇవ్వకపోవటంతో కుటుంబాలు అర్థాకలితో కాలం వెళ్లదీస్తున్నాయి.


గంగ పుత్రుల ఆకలి ఘోష
ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవటంతో మత్స్యకారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వం సముద్రంలో చేపల వృద్ధికి అనుకూలమైనదిగా ఏప్రిల్‌, మే నెలల్లో మత్సకారుల వేటను నిషేధిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 16 వ తేదీ నుండి జూన్‌ 14 వరకూ 61 రోజుల పాటు వేట విరామం ప్రకటించింది. అయితే పూర్తిగా సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడిన మత్సకారులు, వారి కుటుంబాల జీవన భృతికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే వేట నిలిపేసి 45 రోజులైనా ఇప్పటి వరకూ పరిహారం అందలేదని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే విధమైన పరిస్థితి నెలకొంటోందని మత్స్యకారులు వాపోతున్నారు. గతేడాది నిషేధం ఎత్తివేసిన తర్వాత పరిహారం అందిందని అది కాస్తా వడ్డిల పాలైందని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏమాత్రం సరిపోదని మత్స్యకారులు వాపోతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రేషన్‌ కార్డు ఆధారంగా రెండు నెలల కాలానికి రూ.4 వేల చొప్పున మాత్రమే పరిహారం అందచేస్తుంది. పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఆ సొమ్ము ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదంటున్నారు. గతంలో ఇచ్చే రేషన్‌ కూడా ఇప్పుడు నిలిపేశారు. గతేడాది నుండి ఆన్‌లైన్‌ విధానంలో పరిహారం చెల్లింపు ప్రక్రియ చేపట్టారు. అయితే బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సరిగా నమోదు చేయకపోవటంతో కొందిరికి పరిహారం అందచలేదని మత్సకారులంటున్నారు.వేట విరామం సమయంలో మత్స్యకారులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిదినాలు కల్పించాల్సి ఉన్నా ఆదిశగా ప్రభుత్వం ఎక్కడా చర్యలు చేపట్టట్లేదు. ప్రతి ఏటా విరామం ఉంటుందని తెలిసిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో మత్స్యకారుల్ని గుర్తించటం, సకాలంలో పరిహారం అందించటం వంటి చర్యలు తీసుకోవడంలేదని మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిజీవించే మత్స్యకారులకు వేట విరామసమయంలో పనులు లేక అల్లాడుతున్నాం. వేట నిషేద సమయంలో అందించాల్సిన భత్యం తిరిగి వేట మొదలయ్యాకగాని ఇచ్చ

No comments:

Post a Comment