Breaking News

31/05/2019

పదవి విరమణ చేసిన సబ్ ఇన్స్ పెక్టర్ మహ్మద్ నయీముద్దిన్


నయీముద్దిన్ సన్మానించిన పోలీస్ కమీషనర్ 
 సిద్దిపేట, మే 31  (way2newstv.in)
 సిద్దిపేట్ లో స్పెషల్ బ్రాంచ్ సబ్-ఇన్స్ స్పెక్టర్, నయిముద్దిన్  30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి శుక్రవారం పదవి విరమణ చేసారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.ప్రభాకర్, అయనను పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందిన ఆయనకు  శుభాకాంక్షలు తెలియజేస్తు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు,  మెమొంటో అందచేశారు. 


పదవి విరమణ చేసిన సబ్ ఇన్స్ పెక్టర్ మహ్మద్ నయీముద్దిన్ 
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  సిద్దిపేట పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని. “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు. రిటైర్మెంట్ డబ్బులను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా,పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. ఈ కార్యక్రమంలో ఎఓ అయ్యవార అయ్యా, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రవీందర్ రాజు,  స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ ప్రకాష్,  తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment