Breaking News

03/05/2019

చింతమనేని బెట్టింగ్ లే..బెట్టింగ్ లు

ఏలూరు, మే 3, (way2newstv.in)
ప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దెందులూరు నియోజకవర్గంపైనే చర్చ. ఇక్కడ చింతమనేని గెలుస్తారా..? లేదా? గత ఎన్నికల్లో ఇటువంటి సందేహాలు చింతమనేని ప్రభాకర్ ఎదుర్కొన లేదు. వరసగా రెండు సార్లు గెలిచి, హ్యాట్రిక్ విజయం కోసం ఆయన చూస్తున్నప్పుడే గెలుపు పై సందేహాలు మొదలు కావడం విశేషం. చింతమనేనికి ఓటమి రుచి చూపిస్తామంటోంది వైసీపీ. చింతమనేని సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జడ్పీటీసీగా, ఎంపీపీగా గెలిచిన చింతమనేని తొలిసారి 2009 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ చింతమనేని గెలుపును ఎవరూ ఆపలేకపోయారుభిన్నమైన పరిస్థితులు. దెందులూరు నియోజకవర్గంలో రైతులు, దళితులు, కొల్లేరు వాసులు ఎక్కువగా ఉన్నారు. అయితే గత ఐదేళ్లు గా చింతమనేని ప్రభాకర్ కొల్లేరు వాసులలతో కొట్లాటకు దిగి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. 


చింతమనేని బెట్టింగ్ లే..బెట్టింగ్ లు

ఇక దళితులపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి ఆయన క్షమాపణ చెప్పుకుని, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక రైతులకు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ సక్రమంగా చేయకపోవడంతో ఆ ఎఫెక్ట్ దెందులూరులో కూడా కన్పిస్తుందంటున్నారు.చింతమనేని ప్రభాకర్ ప్రజల్లో కలసిపోయే నేత. అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన అందరికంటే వేగంగా, నాణ్యతలో రాజీ పడకుండా చేశారన్న పేరుంది. అయితే ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకోవడమే పార్టీకి, ఆయనకు ఇబ్బందికరంగా మారింది. దెందులూరును కంచుకోటగా మలచుకునేందుకు చింతమనేని చేయని ప్రయత్నాలు లేవు. ఆయన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపనివ్వరన్న మంచి పేరుంది. అయితే తటస్థ ఓటర్లు చింతమనేని వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపడుతుండటంతో ఇప్పుడు గెలుపుపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి కూడా అదే సామాజిక వర్గం కావడంతో టీడీపీకి అండగా ఉండే ప్రధాన సామాజిక వర్గ ఓటర్లు కూడా చింతమనేనికి ఓట్లు వేయలేదని ప్రచారం జరుగుతోంది. కొల్లేరు వాసులు, దళితులు, రైతాంగం తమకు అండగా నిలిచారని, మహిళా ఓటర్లు చింతమనేనికి ఓటు వేసే పరిస్థితి లేదని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. తాము చింతమనేనికి ఓటమి రుచి చూపిస్తామని పెద్దయెత్తున పందేలు కూడా కాస్తుండటం విశేషం. దీనికి తోడు జనసేన కూడా పోటీ చేస్తుండటంతో చింతమనేనికి చింతలు తప్పవన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment