Breaking News

03/05/2019

కడపలో రియల్ ఎస్టేట్ బూమ్

కడప  మే 3, (way2newstv.in)
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చే మే 23వ తేదీకి ఇంకా 19 రోజుల స‌మ‌యం ఉంది. ముఖ్య‌మంత్రి ఎవ‌రో తేలేందుకు దాదాపుగా ఇంకో 20 రోజుల నిరీక్ష‌ణ త‌ప్ప‌దు. అయితే, ఇప్ప‌టికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు తాము అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్లు భావిస్తున్నార‌నే టాక్ ఉంది. వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి ముఖ్య‌మంత్రి పేరుతో నేమ్ ప్లేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మ‌రోవైపు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఇదే స‌రైన తేదీ అంటూ....ఓ వ్య‌క్తి ముహుర్తం సైతం ఖ‌రారు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి తోడుగా జ‌గ‌న్ సీఎం ప్ర‌చారంలో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.


కడపలో రియల్ ఎస్టేట్ బూమ్

వైఎస్ జ‌గ‌న్ సీఎం కానున్నార‌నే ప్ర‌చారాన్ని ఇప్ప‌టివ‌ర‌కు వైసీపీ సానుభూతిప‌రులు ప్ర‌చారంలో పెట్టి...త‌మ పార్టీకి మైలేజ్ పొందేందుకు ప్రయ‌త్నం చేసుకోగా...తాజాగా ఈ ప్ర‌చారాన్ని ఉప‌యోగించుకునేందుకు రియ‌ల్ ఎస్టేట్‌లోని వారు రంగంలోకి దిగారు. వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో రియ‌ల్టీ ప‌రిశ్ర‌మ‌ను రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్లు స‌హా కొంద‌రు వ్య‌క్తులు జ‌గ‌నే కాబోయే సీఎం అనే ప్ర‌చారంతో క్యాష్ చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక ముందే కొనేస్తే, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మంచి రేటుకు అమ్ముకోవచ్చని చాలా మంది రియల్టర్లు ప్ర‌చారం చేస్తున్న‌ట్లు టాక్‌. గత నెల రోజుల క్రితం కూడా సెంట్ భూమి రెండు లక్షలు పలికేది. ఇప్పుడు అది మూడింతలు పెరిగిందని స‌మాచారం. దీంతో కొంతమంది స్థలాలు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటే, మరికొందరు ఏకంగా కొత్త ఇళ్లనే కొనేస్తున్నారని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో కడప జిల్లాలో భారీ స్థాయిలో అభివృద్ధి జ‌రిగి భూములకు రెక్కలొచ్చాయని, ఎప్పుడూ లేనంతగా ఇక్కడి భూములకు ధరలు పెరిగాయనే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ...జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత సైతం అదే జ‌ర‌గ‌నుంద‌ని అంఒటున్నారు. అందుకే ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అంటూ రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ వ‌ర్గాల ప్ర‌చారంలోని వాస్త‌వాలు తేలాలన్నా....వారి ఇన్వెస్ట్‌మెంట్లు స‌రైన ఫ‌లితం ఇస్తాయా..ఇవ్వ‌వా క్లారిటీ రావాల‌న్నా....మే 23 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

No comments:

Post a Comment