Breaking News

02/05/2019

రియల్ ఎస్టేట్ సంస్థలకు గండి

హైద్రాబాద్, మే 1, (way2newstv.in)
రియల్‌ ఎస్టేట్‌, లే అవుట్స్‌, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తున్న సంస్థలను క్రమబద్ధీకరించి, ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ప్రయత్నాలు ఫలించడం లేదు. రేరా పేరుతో ఖాతా ప్రారంభించి రియల్టర్లు ముందస్తుగా తమ పెట్టుబడిలో 70 శాతం బ్యాంకులో డిపాజిట్‌ చేయాలనే నిబంధన అందుకు ప్రతిబంధకంగా మారింది. బ్లాక్‌ మనీ, బ్యాంకు రుణాలతో రియల్‌ వ్యాపారం చేస్తున్న సంస్థలు...ముందుగానే 70 శాతం డిపాజిట్‌ చూపించాలనే నిబంధనతో రెరా నమోదుకు భయపడుతున్నాయి. రెరాలో కొన్ని మార్పులు చేయాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి. రియల్‌ వ్యాపారం చేస్తున్న ప్రమోటర్లు, కన్‌స్ట్రక్షన్స్‌, ఏజెంట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెరాను తెచ్చింది. వినియోగదారుల ప్రయోజనాలతోపాటు ప్రమోటర్ల ద్వారా సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చేందుకు రెరా ఏర్పాటు చేసింది. 


 రియల్ ఎస్టేట్ సంస్థలకు గండి

అందులో నమోదు చేసుకోవాలని అనేక దఫాలుగా రెరా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయినా ఆశించిన స్థాయిలో ప్రమోటర్లు ముందుకు రావడం లేదు. ఫిబ్రవరి 28న చివరి రోజు కావడంతో 52 కంపెనీలు హడావుడిగా దరఖాస్తు చేస్తున్నాయి. ఎన్నిసార్లు సమయమిచ్చినా ప్రమోటర్లు ససేమిరా అంటున్నారు. అయినా మళ్లీ మార్చి 15వరకు పొడిగించింది. గడువు లోపు ముందుకురాని ప్రమోటర్లు, దరఖాస్తు చేసుకుని ముఖం చాటేస్తున్న ప్రమోటర్లు రూ 2 లక్షల పెనాల్టీ చెల్లించకతప్పదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికి ఆశించిన స్పందన కరువైందని అధికారులు చెబుతున్నారు. ప్రమోటర్లు హైదరాబాద్‌, ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయి. రియల్టర్లు, ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు రెరా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మూడు దఫాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలో 3452 రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఉండగా, ఎజెంట్లు సుమారు 5వేల మంది వరకు ఉంటారని అంచనా. అందులో 2233 కంపెనీలు, 1740 మంది ఎజెంట్లు మాత్రమే ఇప్పటివరకు నమోదు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా కంపెనీలను కూడా రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రయత్నం చేస్తున్నది. అందులో 2017లో ఏర్పడిన ప్రతి కంపెనీ విధిగా రెరా పరిధిలోకి రావాలనే నిబంధన పెట్టింది. గతంలో డీటీసీపీ, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, టీఎస్‌ఐఐసీ అనుమతి ఇచ్చినప్పటికీ రెరాలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లలో ఏర్పడిన వివాదాలు, అగ్రిమెంట్‌ ప్రకారం నిర్మాణాలు జరపకపోవడం, భవనాలు నాసిరకంగా నిర్మించడం, తప్పు

No comments:

Post a Comment